అమడగూరు: మండలంలోని తుమ్మల గ్రామం,కొత్తపేట సమీపంలోని తుమ్మల కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక్కపొద్దుల సందర్భంగా నాలుగోవ శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.సుమారు 200 మంది భక్తులు పాల్గొని స్వామివారి దర్శనంతో కృతార్థులయ్యారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…ఈ ప్రాంతంలోని అనేకమంది భక్తులు తిరుమలకు వెళ్లలేని పరిస్థితుల్లో తుమ్మల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తమ కోరికలు తీర్చించుకుంటున్నారు.ముఖ్యంగాకల్యాణయోగం మరియు సంతానయోగం కోసం స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఉందన్నారు.కుటుంబ సమేతంగా భక్తులు వచ్చి తలనీలాలు సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత అని తెలిపారు.ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణను గువ్వల క్రిష్టప్ప బిల్డర్ కొత్తపేట వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేశారు.స్వామివారి కృప ఫలితంగా ఇది సాధ్యమైందని కృతజ్ఞతా భావంతో అన్నప్రసాదం నిర్వహించినట్లు తెలిపారు.ఈ సంవత్సరం నాలుగు వారాలపాటు స్వామివారి సేవలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.అక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.రాబోయే సంవత్సరం కూడా ఇలాగే మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యంగా కొండ కింద షెడ్ నిర్మాణం జరుగుతున్నాయని వాటికి దాతలు సహకారం అవసరమని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గోపిశెట్టి శ్రీనివాసులు,బిల్లూరు మహేశ్వర్ రెడ్డి,రామనేని రామచంద్ర,సరళమ్మ,అరుణ్,అనంత,ఆదిమూర్తి,రామ్మోహన్,ఈశ్వరయ్య,పూజారి రమణ,తదితరులు పాల్గొన్నారు.

తుమ్మల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామికి ఘనంగా ప్రత్యేక పూజలు.