మొంథా తుఫాను ప్రభావంతో రైతులను మరియు సిబ్బందిని అలెర్ట్ చేశాము
–జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్
———————————————-
జనగామ, అక్టోబర్29, పున్నమి న్యూస్:
ఈ రోజు జనగామ జిల్లా లో
మొంథా తుఫాను ప్రభావం వల్ల కురుస్తున భారీ వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ కోరుతున్నారు.
జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు నందు మరియు ఇతర ప్రాంతాల్లో ఐకెపి మరియు PACS సెంటర్లు) లలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం.అదేవిధంగా సంబంధిత అధికారులు రైతులకు ఎల్లవేళల అందుబాటులో ఉండాలని అధికారులను కోరారు.రైతుల కోసం మార్కెట్ యార్డు లో టర్పాలిన్లు అందుబాటు ఉన్నాయి కావున రైతులు వడ్ల రాసులు మరియు వడ్ల బ్యాగులు వర్షం కి తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు మరియు ఇప్పటికే ఏఎంసీ లో సిబ్బంది ని కూడా అలెర్ట్ చేశాము అని అన్నారు.
ఏఎంసీ లో ఉదయం నుంచి సిబ్బంది తో కలిసి ప్రత్యక్షంగా యార్డులో వడ్ల కుప్పలను పరిశీలించడం జరిగిందని అన్నారు


