తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థపై తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాలను ఈ రోజు రాత్రి 7 గంటల నుంచే నిలుపుదల చేయాలని సూచించింది.
వాహనదారులు ముందుగానే సురక్షితమైన లే-బై ప్రాంతాల్లో నిలిపి ఉంచాలని, ప్రమాదకర మార్గాల్లో ప్రయాణం చేయవద్దని సంస్థ హెచ్చరించింది.
అదేవిధంగా ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే ఉండాలని, వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ స్థానిక అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేసింది.


