* తుఫాన్ ప్రభావంతో లోతట్టు ముంపు ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*
* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం పినగాడి జంక్షన్ మరియు అక్కిరెడ్డిపాలెం నుండి జుత్తాడా వెళ్ళు రోడ్లలో దెబ్బతిన్న కల్వర్టు పరిశీలన మొంథా తుఫాన్ ప్రభావంతో *పినగాడి జంక్షన్ నుండి కోటపాడు రహదారిపై* తుఫాను కారణంగా భారీ నీరు ప్రవహించడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఈరోజు ఉదయం జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటన నిర్వహించి సత్వరమే ఈ మార్గంలో రాకపోకలు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులు ప్రారంభించాలని తుఫాను కారణంగా దెబ్బతిన్న కల్వర్టులు,రోడ్లు, సాగునీటి చెరువులు, గడ్డలు, వరి పంట నష్టం, పూరిల్లు, కచ్చా ఇండ్లకు, జరగ నష్టాన్ని దొరకదు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని గౌరవ శాసనసభ్యులు అధికారులకు ఆదేశించడం జరిగింది
ఈ యొక్క కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి వెంకట అప్పారావు గారు, ఎంపీడీవో అప్పలరాజు గారు,పి ఆర్ డిపార్ట్మెంట్ డిఈ గారు,ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నళిని గారు, ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ బాలరాజు గారు, నేషనల్ హైవే అధికారులు, మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రాము నాయుడు గారు, కరక దేవుడు గారు, సీనియర్ నాయకులు బైలుపూడి హర గోపాల్ గారు, పెందుర్తి pacs చైర్మన్ ఐతి సింహాచలం గారు, నేటిపల్లి మహేష్ గారు, సేనాపతి సోమశేఖర్ గారు, ఉగ్గిన అచ్చిబాబు గారు,డిబిఎల్ నాయుడు గారు ,బడితబోయిన రాము గారు, సదరం భీమేశ్వరావు గారు, రాపర్తి కృష్ణమోహన్ గారు రాపర్తి కిషోర్ గారు, అక్కిరెడ్డి నరసింహమూర్తి గారు,మొదలగు స్థానిక నేతలు ఈ యొక్క పర్యాటన కార్యక్రమంలో పాల్గొన్నారు.


