Thursday, 5 February 2026
  • Home  
  • తుఫాను బాధిత మత్స్యకారులకు నిత్యవసర సరుకులు పంపిణీ — డాక్టర్ కందుల నాగరాజు
- విశాఖపట్నం

తుఫాను బాధిత మత్స్యకారులకు నిత్యవసర సరుకులు పంపిణీ — డాక్టర్ కందుల నాగరాజు

తుఫాను బాధిత మత్స్యకారులకు నిత్యవసర సరుకులు పంపిణీ — డాక్టర్ కందుల నాగరాజు *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * తుఫాను బాధిత మత్స్యకారులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసినట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. సుమారు ఏడుగురు మత్స్యకారులకు నిత్యవసర సరుకులు అందజేసినట్లు వెల్లడించారు. 50 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్, కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పంచదారను తుఫాను బాధిత మత్స్యకారులకు అందజేసినట్లు వెల్లడించారు. ఇటీవల వచ్చిన మొందా తుఫాను సమయంలో 32 వ వార్డులో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. అవసరమైన వారికి సహాయం చేసినట్లు వెల్లడించారు. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల మంచి కోసం తాను ఏమి చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా అందరికీ తాను సహాయం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఇటువంటి వారికి మానవతా దృష్టితో సహాయం చేయాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ పి వి రమణ, సిపిఐ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

తుఫాను బాధిత మత్స్యకారులకు నిత్యవసర సరుకులు పంపిణీ
— డాక్టర్ కందుల నాగరాజు

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *

తుఫాను బాధిత మత్స్యకారులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసినట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు.
సుమారు ఏడుగురు మత్స్యకారులకు నిత్యవసర సరుకులు అందజేసినట్లు వెల్లడించారు.
50 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్,
కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పంచదారను తుఫాను బాధిత మత్స్యకారులకు అందజేసినట్లు వెల్లడించారు.
ఇటీవల వచ్చిన మొందా తుఫాను సమయంలో 32 వ వార్డులో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పడం జరిగిందన్నారు.
అవసరమైన వారికి సహాయం చేసినట్లు వెల్లడించారు.
ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల మంచి కోసం తాను ఏమి చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
రాజకీయాలకతీతంగా అందరికీ తాను సహాయం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఇటువంటి వారికి మానవతా దృష్టితో సహాయం చేయాలని అభిలాషించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఐ పి వి రమణ, సిపిఐ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.