అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29
అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ బుధవారం అరకు మండలంలోని మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన సుంకరిమెట్ట, గాలికొండ, బిసుపురం గ్రామాలను సందర్శించారు. మొంథా తుఫాన్ కారణంగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితులను పాడేరు డీఎస్పీ సహబాజ్ అహమద్ తో కలసి ఎస్పీ పరిశీలించారు. రోడ్లపై ఉన్న వరద నీరు, చెత్త, చెట్లు, ఇతర అడ్డంకులను త్వరగా తొలగించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. ప్రజల రాకపోకలు సులభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకున్న ముందస్తు చర్యలకు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఎస్పీ పర్యటనలో అరకు సీఐ ఎల్ హిమగిరి, ఎస్ఐ జి గోపాలరావు ఉన్నారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్
అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29 అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ బుధవారం అరకు మండలంలోని మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన సుంకరిమెట్ట, గాలికొండ, బిసుపురం గ్రామాలను సందర్శించారు. మొంథా తుఫాన్ కారణంగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితులను పాడేరు డీఎస్పీ సహబాజ్ అహమద్ తో కలసి ఎస్పీ పరిశీలించారు. రోడ్లపై ఉన్న వరద నీరు, చెత్త, చెట్లు, ఇతర అడ్డంకులను త్వరగా తొలగించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. ప్రజల రాకపోకలు సులభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకున్న ముందస్తు చర్యలకు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఎస్పీ పర్యటనలో అరకు సీఐ ఎల్ హిమగిరి, ఎస్ఐ జి గోపాలరావు ఉన్నారు.

