Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

తుప్పు పట్టి నిరుపయోగంగా మారుతున్న ప్రభుత్వ వాహనాలు.

Punnami Newsroom Published:
తుప్పు పట్టి నిరుపయోగంగా మారుతున్న ప్రభుత్వ వాహనాలు.

Story highlights

  • ప్రభుత్వ నిధులతో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు అధికారుల పర్యవేక్షణ లోపంతో కార్యాలయాలకే పరిమితమై నిరుపయోగంగా మారుతున్నాయి.
  • ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ (పీఆర్) కార్యాలయాల పరిధిలో ఉన్న జీపులు, బోర్ల మరమ్మతులకు వినియోగించే వాహనాలు ప్రస్తుతం తుప్పు పట్టి శిథిలావస్థకు చేరుతున్నాయి.
  • వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ప్రభుత్వ ఆస్తులు వృథా అవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ నిధులతో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు అధికారుల పర్యవేక్షణ లోపంతో కార్యాలయాలకే పరిమితమై నిరుపయోగంగా మారుతున్నాయి. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ (పీఆర్) కార్యాలయాల పరిధిలో ఉన్న జీపులు, బోర్ల మరమ్మతులకు వినియోగించే వాహనాలు ప్రస్తుతం తుప్పు పట్టి శిథిలావస్థకు చేరుతున్నాయి. వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ప్రభుత్వ ఆస్తులు వృథా అవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతులకు అవకాశం లేని వాహనాలను గుర్తించి, నిబంధనల ప్రకారం వేలం నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి కొంత ఆదాయం సమకూరడంతో పాటు కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న వాహనాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *