నందిగామ, బుధవారం: మొంథా తుపాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, నందిగామ పట్టణంలోని డివిఆర్ ఏరియా హాస్పిటల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బుధవారం సందర్శించారు.
సందర్శనలో ఆమె: రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు పరిశీలించారు. అవసరమైన ఔషధ నిల్వలు, అత్యవసర సిబ్బంది విధులు, మరియు పూర్తిస్థాయి వైద్య సదుపాయా లు సమర్థవంతంగా నిర్వహించ మని వైద్య అధికారులకు ఆదేశించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల నుండి ఆసుపత్రికి తరలింపబడే బాధితులకు తక్షణ చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్, నీటి సరఫరా మరియు శానిటేషన్ సేవలు నిరంతరం కొనసాగేలా సంబంధిత శాఖలతో సమన్వయం అవసరమని తెలిపారు. హాస్పిటల్ సందర్శన లో హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తుపాన్ సమయంలో వైద్య సేవలు నిరంతరం కొనసాగించా లని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశం
నందిగామ, బుధవారం: మొంథా తుపాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, నందిగామ పట్టణంలోని డివిఆర్ ఏరియా హాస్పిటల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బుధవారం సందర్శించారు. సందర్శనలో ఆమె: రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు పరిశీలించారు. అవసరమైన ఔషధ నిల్వలు, అత్యవసర సిబ్బంది విధులు, మరియు పూర్తిస్థాయి వైద్య సదుపాయా లు సమర్థవంతంగా నిర్వహించ మని వైద్య అధికారులకు ఆదేశించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల నుండి ఆసుపత్రికి తరలింపబడే బాధితులకు తక్షణ చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్, నీటి సరఫరా మరియు శానిటేషన్ సేవలు నిరంతరం కొనసాగేలా సంబంధిత శాఖలతో సమన్వయం అవసరమని తెలిపారు. హాస్పిటల్ సందర్శన లో హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

