తిరుపతి జిల్లా, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినవి. ఈ సంవత్సరం సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇచ్చి అన్ని ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. భక్తుల కోసం 16 రకాల ప్రత్యేక వంటకాలు సిద్ధం చేశారు. భక్తులు గంటల తరబడి క్రమంలో చూడకుండా 45 నిమిషాలకు సుమారు 35,000 మంది గ్యాలరీల్లోకి రీఫిల్లింగ్ పద్ధతిలో ప్రవేశించగలరు. మాడ వీధుల బయట 36 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఉత్సవాలను వీక్షించేందుకు సౌకర్యం కల్పించారు. భద్రత కోసం 4,700 పోలీసులు, 2,000 టీటీడీ సిబ్బంది, 3,000 సీసీ కెమెరాలు ఉపయోగించి పటిష్ఠ నియంత్రణ పెట్టారు. 3,500 మంది శ్రీవారి సేవకులు భక్తులను సహాయం చేస్తారు. కొండపై రాకపోకలకు ప్రతి 4 నిమిషాలకు బస్సులు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక యాప్, చెప్పుల సమస్యను QR కోడ్ ద్వారా పరిష్కరించనున్నారు. భక్తుల వసతి కోసం మఠాల నుంచి 60 శాతం గదులు, రోజూ 8 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంటాయి. ఈ సక్రమ ప్రణాళికతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం రాకుండా నిర్వహిస్తారు.

