Sunday, 7 December 2025
  • Home  
  • తిరుమల ఆచారాలను అవమానించిన జగన్ రెడ్డి పై రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా ఆగ్రహం*
- విశాఖపట్నం

తిరుమల ఆచారాలను అవమానించిన జగన్ రెడ్డి పై రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా ఆగ్రహం*

*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- *తిరుమల ఆచారాలను అవమానించిన జగన్ రెడ్డి పై రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా ఆగ్రహం* *జగన్ పాలనలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను మళ్లీ నిలబెట్టిన విజనరీ చంద్రబాబు* *– రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు* విశాఖపట్నం, డిసెంబర్ 05: తిరుమల శ్రీవారి పవిత్ర నామాన్ని రాజకీయ అబద్ధాల కోసం వాడుకోవడం జగన్‌మోహన్ రెడ్డి అలవాటైపోయిందని, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి గురుంచి, సనాతన ధర్మం అంటే ఏంటో కూడా అర్థం కాని జగన్ రెడ్డి కి స్వామివారి గురించి మాట్లాడే అర్హత లేదు అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు తీవ్రంగా విమర్శించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కోట్లాది హిందువుల విశ్వాసం. స్వామివారి హుండీలో పడే ప్రతి పైసా భక్తి కన్నీటి కానుక అని, అలాంటి పవిత్ర సమర్పణను అపవిత్రం చేయటం దేవద్రోహమని పల్లా గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రం లో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళ హయం లో తిరుమల ఎంతో కొంత అభివృద్ది నోచుకుంది కానీ జగన్ రెడ్డి హయం లో అభివృద్ది మాట పక్కన పెడితే స్వామి వారిని అపహేళన మాట్లాడటం, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేశారని పల్లా గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకామణి కేసు దొంగ చేతికి అధికారం ఇస్తే ఏమవుతుందో చెప్పే తార్కాణం అని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజులకు ఒక్కసారి మీడియా ఎదుటకు వచ్చి “నేను ఉన్నా, మా పార్టీ ఉంది” అని నటించే జగన్ నాటకాన్ని ప్రజలు చూసి నవ్వుకుంటున్నారని అన్నారు. “నీ నోటి వెంట నిజం రాదు.. నిద్రలో లేపి దేవుడి గురించే అడిగినా అబద్ధమే చెప్తావు. ఎందుకంటే నీలో భక్తి లేదు, భయం లేదు” అని పల్లా గారు దుయ్యబట్టారు. భక్తులు కష్టపడి సంపాదించి స్వామివారికి సమర్పించిన మొక్కుబడులను కూడా దోచుకునే ధైర్యం జగన్ పాలనలోనే కనిపించిందని ఆయన విమర్శించారు. కేవలం రూ.72,000 చోరీకే వందల కోట్ల ఆస్తులు రాసిపెట్టడం, కేసు పెట్టిన వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం, వివేక హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోవడం..ఇవన్నీ జగన్ ముఠా పని తీరు ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాయని అన్నారు. రూ.11 దొంగతనం చేసినా, 11 కోట్లు దోచుకున్నా చట్టం ముందు రెండూ నేరాలే. నేరస్తుడిని సమర్థించడం మరింత పెద్ద నేరం అని పల్లా గారు హెచ్చరించారు. తిరుమల నెయ్యి కల్తీ విషయంలో పల్లా గారు మరింత ఘాటుగా స్పందించారు. ఒక్క చుక్క పాలు కూడా లేకుండా తయారు చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో వాడటం ఇది అవినీతి కాదు, ఇది మహా పాపం. పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం ధార్మిక ద్రోహం అన్నారు. టెండర్ పిలవడం నుంచి సరఫరా ప్రారంభం అయ్యేవరకు అన్ని వైసీపీ హయాంలోనే జరిగాయని, చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే సరఫరా మొదలుపెట్టడం కుట్రేనని పల్లా గారు ఖండించారు. సీబీఐ విచారణ కోరింది మీరే… మరి ఇప్పుడు ఎందుకు వణుకుతున్నారు? ఎందుకు కోర్టు మెట్లు ఎక్కి విజిలెన్స్ విచారణ వద్దు అంటున్నారు? కల్తీ నెయ్యి వెనుక ఉన్న అసలైన నిందితులు బయటపడతారనే భయం కదా?” అని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు సిట్ చేసిన అరెస్టులు వైసీపీ పాలనలో జరిగిన భారీ దోపిడీకి తొలి శిక్ష అని అన్నారు. తిరుమల ఆచార వ్యవహారాలు కూడా జగన్‌కు తెలియవని పల్లా గారు మండిపడ్డారు. “గుడిలో చెప్పులు వేసుకుని రాకూడదన్న సాధారణ ఆచారం కూడా తెలియని వ్యక్తి తిరుమల రూల్స్ గురించి ఉపన్యాసాలు చేయడం భక్తుల మనోభావాలపై దాడి. వేంకటేశ్వర స్వామికి సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించాలనే ఆచారం కూడా ఆయనకు తెలియదు” అని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అత్యంత గౌరవంతో చూసే న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు, సీనియర్ IAS అధికారులను ‘వాడు–వీడు’ అంటూ అవమానకరంగా సంబోధించడం.. చివరికి కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని కూడా చులకనగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి అహంకార స్వభావానికి అద్దం పడుతుంది. న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేయడం, ఉన్నతాధికారులను బెదిరించడం, కోర్టులపై దుష్ప్రచారం చేయించడం ఇవన్నీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే చర్యలు. న్యాయానికి, రాజ్యాంగానికి కనీస గౌరవం లేని ఇటువంటి వ్యక్తి దేశంలో ఎక్కడా ఉండరని మండిపడ్డారు. జగన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి వనం‌గా మార్చి, కల్తీ మద్యం మహమ్మారిలా వ్యాపింపజేసి వేలాది కుటుంబాలను దుఃఖంలో ముంచాడు. రాష్ట్రం మొత్తం నేరాలు, డ్రగ్స్, కల్తీ మద్యం దందాలతో పరువు పోయేలా చేసి, ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్ ఇమేజ్‌ను దేశంలోనే అత్యంత హీన స్థితికి నెట్టాడు. కానీ అదే రాష్ట్రాన్ని తిరిగి గౌరవప్రదమైన దిశగా నడిపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను మరోసారి ప్రపంచ పటంలో నిలబెడుతున్నవారు మన విజనరీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు. ప్రపంచం అంతటా పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు ఆకర్షించేలా ‘న్యూ ఏపీ బ్రాండ్’ను మళ్లీ నిర్మించడం వారి స్పష్టమైన దూరదృష్టి, కష్టపాటు వల్లే సాధ్యమవుతోందని అన్నారు. నేడు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమాన్ని నిర్వహించింది. 45,000 ప్రభుత్వ, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం ప్రత్యేక ఉత్సాహంతో సాగిందని తెలిపారు. ఇలాంటి పేరెంట్-టీచర్ మీటింగ్స్ విద్యార్థుల విద్యాభివృద్ధికి, తల్లిదండ్రుల అవగాహనకు, పాఠశాలల సామరస్యానికి గొప్ప వేదికగా మారుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు లోకేష్ గారు హాజరై ప్రత్యేక ప్రాతినిధ్యం అందించడం, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే సంకేతం అని పల్లా గారు చెప్పారు. తల్లిదండ్రుల పాల్గొనడం వల్ల పాఠశాలల్లో విద్యార్ధుల అభ్యాసం, సానుకూల వాతావరణం గురించి సమగ్ర అవగాహన ఏర్పడుతుందని, ఈ రోజు ఘనంగా, విజయవంతంగా ముగియడం ప్రభుత్వ విద్యా విధానాలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచిందని పల్లా గారు పేర్కొన్నారు.

*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:-

*తిరుమల ఆచారాలను అవమానించిన జగన్ రెడ్డి పై రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా ఆగ్రహం*
*జగన్ పాలనలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను మళ్లీ నిలబెట్టిన విజనరీ చంద్రబాబు*
*– రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*

విశాఖపట్నం, డిసెంబర్ 05: తిరుమల శ్రీవారి పవిత్ర నామాన్ని రాజకీయ అబద్ధాల కోసం వాడుకోవడం జగన్‌మోహన్ రెడ్డి అలవాటైపోయిందని, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి గురుంచి, సనాతన ధర్మం అంటే ఏంటో కూడా అర్థం కాని జగన్ రెడ్డి కి స్వామివారి గురించి మాట్లాడే అర్హత లేదు అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు తీవ్రంగా విమర్శించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కోట్లాది హిందువుల విశ్వాసం. స్వామివారి హుండీలో పడే ప్రతి పైసా భక్తి కన్నీటి కానుక అని, అలాంటి పవిత్ర సమర్పణను అపవిత్రం చేయటం దేవద్రోహమని పల్లా గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రం లో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళ హయం లో తిరుమల ఎంతో కొంత అభివృద్ది నోచుకుంది కానీ జగన్ రెడ్డి హయం లో అభివృద్ది మాట పక్కన పెడితే స్వామి వారిని అపహేళన మాట్లాడటం, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేశారని పల్లా గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరకామణి కేసు దొంగ చేతికి అధికారం ఇస్తే ఏమవుతుందో చెప్పే తార్కాణం అని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజులకు ఒక్కసారి మీడియా ఎదుటకు వచ్చి “నేను ఉన్నా, మా పార్టీ ఉంది” అని నటించే జగన్ నాటకాన్ని ప్రజలు చూసి నవ్వుకుంటున్నారని అన్నారు. “నీ నోటి వెంట నిజం రాదు.. నిద్రలో లేపి దేవుడి గురించే అడిగినా అబద్ధమే చెప్తావు. ఎందుకంటే నీలో భక్తి లేదు, భయం లేదు” అని పల్లా గారు దుయ్యబట్టారు. భక్తులు కష్టపడి సంపాదించి స్వామివారికి సమర్పించిన మొక్కుబడులను కూడా దోచుకునే ధైర్యం జగన్ పాలనలోనే కనిపించిందని ఆయన విమర్శించారు.

కేవలం రూ.72,000 చోరీకే వందల కోట్ల ఆస్తులు రాసిపెట్టడం, కేసు పెట్టిన వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం, వివేక హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోవడం..ఇవన్నీ జగన్ ముఠా పని తీరు ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాయని అన్నారు. రూ.11 దొంగతనం చేసినా, 11 కోట్లు దోచుకున్నా చట్టం ముందు రెండూ నేరాలే. నేరస్తుడిని సమర్థించడం మరింత పెద్ద నేరం అని పల్లా గారు హెచ్చరించారు.

తిరుమల నెయ్యి కల్తీ విషయంలో పల్లా గారు మరింత ఘాటుగా స్పందించారు. ఒక్క చుక్క పాలు కూడా లేకుండా తయారు చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో వాడటం ఇది అవినీతి కాదు, ఇది మహా పాపం. పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం ధార్మిక ద్రోహం అన్నారు. టెండర్ పిలవడం నుంచి సరఫరా ప్రారంభం అయ్యేవరకు అన్ని వైసీపీ హయాంలోనే జరిగాయని, చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే సరఫరా మొదలుపెట్టడం కుట్రేనని పల్లా గారు ఖండించారు.

సీబీఐ విచారణ కోరింది మీరే… మరి ఇప్పుడు ఎందుకు వణుకుతున్నారు? ఎందుకు కోర్టు మెట్లు ఎక్కి విజిలెన్స్ విచారణ వద్దు అంటున్నారు? కల్తీ నెయ్యి వెనుక ఉన్న అసలైన నిందితులు బయటపడతారనే భయం కదా?” అని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు సిట్ చేసిన అరెస్టులు వైసీపీ పాలనలో జరిగిన భారీ దోపిడీకి తొలి శిక్ష అని అన్నారు.

తిరుమల ఆచార వ్యవహారాలు కూడా జగన్‌కు తెలియవని పల్లా గారు మండిపడ్డారు. “గుడిలో చెప్పులు వేసుకుని రాకూడదన్న సాధారణ ఆచారం కూడా తెలియని వ్యక్తి తిరుమల రూల్స్ గురించి ఉపన్యాసాలు చేయడం భక్తుల మనోభావాలపై దాడి. వేంకటేశ్వర స్వామికి సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించాలనే ఆచారం కూడా ఆయనకు తెలియదు” అని విమర్శించారు.

రాష్ట్ర ప్రజలు అత్యంత గౌరవంతో చూసే న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు, సీనియర్ IAS అధికారులను ‘వాడు–వీడు’ అంటూ అవమానకరంగా సంబోధించడం.. చివరికి కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని కూడా చులకనగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి అహంకార స్వభావానికి అద్దం పడుతుంది. న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేయడం, ఉన్నతాధికారులను బెదిరించడం, కోర్టులపై దుష్ప్రచారం చేయించడం ఇవన్నీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే చర్యలు. న్యాయానికి, రాజ్యాంగానికి కనీస గౌరవం లేని ఇటువంటి వ్యక్తి దేశంలో ఎక్కడా ఉండరని మండిపడ్డారు.
జగన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి వనం‌గా మార్చి, కల్తీ మద్యం మహమ్మారిలా వ్యాపింపజేసి వేలాది కుటుంబాలను దుఃఖంలో ముంచాడు. రాష్ట్రం మొత్తం నేరాలు, డ్రగ్స్, కల్తీ మద్యం దందాలతో పరువు పోయేలా చేసి, ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్ ఇమేజ్‌ను దేశంలోనే అత్యంత హీన స్థితికి నెట్టాడు. కానీ అదే రాష్ట్రాన్ని తిరిగి గౌరవప్రదమైన దిశగా నడిపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను మరోసారి ప్రపంచ పటంలో నిలబెడుతున్నవారు మన విజనరీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు. ప్రపంచం అంతటా పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు ఆకర్షించేలా ‘న్యూ ఏపీ బ్రాండ్’ను మళ్లీ నిర్మించడం వారి స్పష్టమైన దూరదృష్టి, కష్టపాటు వల్లే సాధ్యమవుతోందని అన్నారు.

నేడు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమాన్ని నిర్వహించింది. 45,000 ప్రభుత్వ, ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం ప్రత్యేక ఉత్సాహంతో సాగిందని తెలిపారు. ఇలాంటి పేరెంట్-టీచర్ మీటింగ్స్ విద్యార్థుల విద్యాభివృద్ధికి, తల్లిదండ్రుల అవగాహనకు, పాఠశాలల సామరస్యానికి గొప్ప వేదికగా మారుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు లోకేష్ గారు హాజరై ప్రత్యేక ప్రాతినిధ్యం అందించడం, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే సంకేతం అని పల్లా గారు చెప్పారు. తల్లిదండ్రుల పాల్గొనడం వల్ల పాఠశాలల్లో విద్యార్ధుల అభ్యాసం, సానుకూల వాతావరణం గురించి సమగ్ర అవగాహన ఏర్పడుతుందని, ఈ రోజు ఘనంగా, విజయవంతంగా ముగియడం ప్రభుత్వ విద్యా విధానాలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచిందని పల్లా గారు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.