Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Amaravati

తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,

Punnami Newsroom Published:
తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,

Story highlights

  • *అమరావతి (విశాఖ పున్నమి ప్రతినిధి)* * తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
  • * అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణం.
  • రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ .

*అమరావతి (విశాఖ పున్నమి ప్రతినిధి)*
* తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
* అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణం. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ .
* * ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
* నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
* గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు.
* ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర తెలుసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *