Thursday, 26 March 2026
  • Home  
  • తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వాహన తనిఖీలు
- తిరుపతి

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వాహన తనిఖీలు

పున్నమి ప్రతినిధి 26 మార్చి 2026. తిరుపతి రోడ్డు ప్రమాదాల నివారణకు జాయింట్ ఆపరేషన్. టోల్ ప్లాజాల వద్ద విస్తృత వాహన తనిఖీలు భద్రతపై ప్రత్యేక దృష్టి. పోలీస్, ట్రాన్స్పోర్ట్, అగ్నిమాపక శాఖల సంయుక్త చర్యలు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారి నేతృత్వంలో పోలీస్ శాఖ, ట్రాన్స్పోర్ట్ మరియు అగ్నిమాపక శాఖలు సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈరోజు మార్కాపురంలో జరిగిన విషాద ఘటనను దృష్టిలో ఉంచుకొని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చెన్నై–విజయవాడ, తిరుపతి–చెన్నై, తిరుపతి–విజయవాడ జాతీయ రహదారుల ఏర్పేడు టోల్ ప్లాజా, వడమాలపేట టోల్ ప్లాజా ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ట్రావెల్స్ బస్సులు మరియు సుదూర ప్రయాణ వాహనాలు లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో అధికారులు వాహన భద్రతా ప్రమాణాలు డ్రైవర్ల పనితీరు అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా లేదా, బస్సుల్లో ఏమైనా ప్రమాదకర వస్తువులు ఉన్నాయా, ఏదైనా అనుకోని ఘటనలు జరిగితే తగిన ఏర్పాట్లు ఉన్నాయా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే అవసరమైన సూచనలు ఇచ్చి, ప్రజల భద్రతకు చర్యలు చేపట్టారు. అలాగే, జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఇటువంటి తనిఖీలు నిరంతరం నిర్వహించాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్ గారు వెల్లడించారు. పోలీస్ శాఖ సూచన: రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ, ట్రాన్స్పోర్ట్ శాఖ మరియు అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి 26 మార్చి 2026. తిరుపతి

రోడ్డు ప్రమాదాల నివారణకు జాయింట్ ఆపరేషన్. టోల్ ప్లాజాల వద్ద విస్తృత వాహన తనిఖీలు భద్రతపై ప్రత్యేక దృష్టి. పోలీస్, ట్రాన్స్పోర్ట్, అగ్నిమాపక శాఖల సంయుక్త చర్యలు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారి నేతృత్వంలో పోలీస్ శాఖ, ట్రాన్స్పోర్ట్ మరియు అగ్నిమాపక శాఖలు సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈరోజు మార్కాపురంలో జరిగిన విషాద ఘటనను దృష్టిలో ఉంచుకొని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చెన్నై–విజయవాడ, తిరుపతి–చెన్నై, తిరుపతి–విజయవాడ జాతీయ రహదారుల ఏర్పేడు టోల్ ప్లాజా, వడమాలపేట టోల్ ప్లాజా ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ట్రావెల్స్ బస్సులు మరియు సుదూర ప్రయాణ వాహనాలు లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో అధికారులు వాహన భద్రతా ప్రమాణాలు డ్రైవర్ల పనితీరు అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా లేదా, బస్సుల్లో ఏమైనా ప్రమాదకర వస్తువులు ఉన్నాయా, ఏదైనా అనుకోని ఘటనలు జరిగితే తగిన ఏర్పాట్లు ఉన్నాయా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే అవసరమైన సూచనలు ఇచ్చి, ప్రజల భద్రతకు చర్యలు చేపట్టారు. అలాగే, జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఇటువంటి తనిఖీలు నిరంతరం నిర్వహించాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు.
రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్ గారు వెల్లడించారు.
పోలీస్ శాఖ సూచన: రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ, ట్రాన్స్పోర్ట్ శాఖ మరియు అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.