*శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం, శ్రీ కొట్టే సాయి ప్రసాద్ గారు మొదటిసారిగా తిరుపతి జిల్లా కలెక్టర్ గారిని మరియు జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చైర్మన్ గారు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు మరియు స్వామివారి ఫోటోలను జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి అందజేశారు.
ఈ భేటీలో ఆలయ అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాల మెరుగుదల, జిల్లా స్థాయి సమన్వయంపై చర్చించడం జరిగింది.


