Wednesday, 18 March 2026
  • Home  
  • తిరుపతి అభివృద్ధిలో మరో ముందడుగు ఉప్పరపల్లి – మహిళా యూనివర్సిటీ రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ.
- తిరుపతి

తిరుపతి అభివృద్ధిలో మరో ముందడుగు ఉప్పరపల్లి – మహిళా యూనివర్సిటీ రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ.

పున్నమి ప్రతినిధి, 18 మార్చి 2026 తిరుపతి తిరుపతి నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే క్రమంలో భాగంగా, తుడా ఆధ్వర్యంలో ఉప్పరపల్లి చెక్ పోస్ట్ నుండి మహిళా యూనివర్సిటీ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు బుధవారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథులుగా పాల్గొని పనులను ప్రారంభించారు. తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.ఉప్పరపల్లి నుండి మహిళా వర్సిటీ వరకు ఉన్న ఈ మార్గం అత్యంత కీలకమైనదని,ఈ రోడ్డు విస్తరణ వల్ల వేలమంది విద్యార్థులకు, స్థానిక ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని,తుడా నిధులతో యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ విస్తరణలో భాగంగా డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ మరియు పాదచారుల కోసం ప్రత్యేక ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా, ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఈ పనులను పూర్తి చేయాలని తుడా అధికారులకు తుడా ఛైర్మన్ సూచించారు.* ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ:చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రహదారులను నేడు ప్రాధాన్యత క్రమంలో బాగు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడా ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి, 18 మార్చి 2026 తిరుపతి

తిరుపతి నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే క్రమంలో భాగంగా, తుడా ఆధ్వర్యంలో ఉప్పరపల్లి చెక్ పోస్ట్ నుండి మహిళా యూనివర్సిటీ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు బుధవారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథులుగా పాల్గొని పనులను ప్రారంభించారు.
తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.ఉప్పరపల్లి నుండి మహిళా వర్సిటీ వరకు ఉన్న ఈ మార్గం అత్యంత కీలకమైనదని,ఈ రోడ్డు విస్తరణ వల్ల వేలమంది విద్యార్థులకు, స్థానిక ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని,తుడా నిధులతో యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ విస్తరణలో భాగంగా డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ మరియు పాదచారుల కోసం ప్రత్యేక ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా, ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఈ పనులను పూర్తి చేయాలని తుడా అధికారులకు తుడా ఛైర్మన్ సూచించారు.* ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ:చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రహదారులను నేడు ప్రాధాన్యత క్రమంలో బాగు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడా ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.