రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో అంబేద్కర్ మాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాలు మరియు నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొని, గ్రామ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, గ్రామ సర్పంచ్ అందె సుభాష్, మాజీ ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుంబాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామస్థులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను జరుపుకున్నారు.

తిమ్మాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు – నూతన విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న తోట ఆగన్న
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో అంబేద్కర్ మాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాలు మరియు నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొని, గ్రామ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, గ్రామ సర్పంచ్ అందె సుభాష్, మాజీ ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుంబాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామస్థులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను జరుపుకున్నారు.

