తాడిపత్రి, అక్టోబర్ 07: (పున్నమి ప్రతినిధి)
మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు తాడిపత్రి పట్టణంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడపత్రి ఎల్లనూరు రోడ్ వాల్మీకి సర్కిల్ వద్ద వాల్మీకి మహర్షికి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం వాల్మీకి సేవాదళ్ పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ మాదిగ, పెద్దపప్పూరు మండల సిపిఐ కార్యదర్శి చింతా పురుషోత్తం, వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా అధ్యక్షుడు నారాయణరెడ్డి హాజరయ్యారు.చాగల్లు గ్రామం నుండి దాదాపు 15 వాహనాల్లో 100 మంది వాల్మీకి సంఘం, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, చేనేత కార్మికులు భారీ ర్యాలీగా పెద్దపప్పూరు మండల కేంద్రంలో ప్రవేశించారు. “వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి” అనే నినాదాలతో ఈ ర్యాలీ అంబేద్కర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంక్ వరకు సాగి, అనంతరం తాడిపత్రి పట్టణంలోని వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద ముగిసింది.అక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ—
వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి సమాజానికి శాశ్వత విలువలు నేర్పారని, ఆయన అందరికీ దేవుడని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ పేర్కొన్నారు.వాల్మీకి మహర్షి ఐక్యతకు ప్రతీక అని, ప్రతి సంవత్సరం మరింత ఘనంగా జయంతి జరుపుకోవాలని వాల్మీకి సంఘం పార్లమెంటు అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య పిలుపునిచ్చారు.భార్యభర్తల బంధాలు, అన్నదమ్ముల విలువలు రామాయణం ద్వారా సమాజానికి అందించిన మహానుభావుడు వాల్మీకి అని సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో బోడయ్యపల్లి, ఆది తాడిపత్రి, చిన్న పెద్దపప్పూరు ప్రాంతాల నుండి పలువురు వాల్మీకి సంఘ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, చేనేత కార్మికులు పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.

తాడిపత్రి పట్టణంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా
తాడిపత్రి, అక్టోబర్ 07: (పున్నమి ప్రతినిధి) మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు తాడిపత్రి పట్టణంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడపత్రి ఎల్లనూరు రోడ్ వాల్మీకి సర్కిల్ వద్ద వాల్మీకి మహర్షికి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం వాల్మీకి సేవాదళ్ పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ మాదిగ, పెద్దపప్పూరు మండల సిపిఐ కార్యదర్శి చింతా పురుషోత్తం, వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా అధ్యక్షుడు నారాయణరెడ్డి హాజరయ్యారు.చాగల్లు గ్రామం నుండి దాదాపు 15 వాహనాల్లో 100 మంది వాల్మీకి సంఘం, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, చేనేత కార్మికులు భారీ ర్యాలీగా పెద్దపప్పూరు మండల కేంద్రంలో ప్రవేశించారు. “వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి” అనే నినాదాలతో ఈ ర్యాలీ అంబేద్కర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంక్ వరకు సాగి, అనంతరం తాడిపత్రి పట్టణంలోని వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద ముగిసింది.అక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ— వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి సమాజానికి శాశ్వత విలువలు నేర్పారని, ఆయన అందరికీ దేవుడని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ పేర్కొన్నారు.వాల్మీకి మహర్షి ఐక్యతకు ప్రతీక అని, ప్రతి సంవత్సరం మరింత ఘనంగా జయంతి జరుపుకోవాలని వాల్మీకి సంఘం పార్లమెంటు అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య పిలుపునిచ్చారు.భార్యభర్తల బంధాలు, అన్నదమ్ముల విలువలు రామాయణం ద్వారా సమాజానికి అందించిన మహానుభావుడు వాల్మీకి అని సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో బోడయ్యపల్లి, ఆది తాడిపత్రి, చిన్న పెద్దపప్పూరు ప్రాంతాల నుండి పలువురు వాల్మీకి సంఘ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, చేనేత కార్మికులు పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.

