తాగునీటి సమస్యలకు రూ .1.40 కోట్లు మంజూరు ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా

0
193

నగరి నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్న 96 గ్రామాలను గుర్తించి పరిష్కారం కోసం రూ .1.40 కోట్లు మంజూరు చేయించినట్లు నగరి ఎమ్మెల్యే , ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్.కే. రోజా తెలిపారు . మంగళవారం ఆమె నగరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు . ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా నిధులు విడుదల చేసి తాగునీటి సమస్య పరిష్కారం కోసం 96 గ్రామాల్లో బోర్లు వేయించేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నారు . ఇందుకుగాను 80 పనులను గుర్తించి ఆ దిశగా జిల్లా కలెక్టర్ కు ఆర్ డబ్ల్యు ఎస్ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు . దీంతో ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు చర్యలు చేపట్టడంతో పాటు తాగునీటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని రోజా వివరించారు . ఆ దిశగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులను వేగవంతం చేయాలని మండలాల అధికారులకు సూచించారు . గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమైతే గ్రామీణ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే రోజా కు రుణపడి ఉంటారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు .