ఖమ్మం పున్నమి ప్రతినిధి
: బిజెపి మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బైకు ర్యాలీగా కొమరం భీం విగ్రహం నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు మరియు బిజెపి నాయకులు కలిసి ధర్నా నిర్వహించి అనంతరం స్థానిక సమస్యలపై తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానంగా జూలూరుపాడు మండలం వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములకు సీతారాం ప్రాజెక్టు ద్వారా తక్షణమే కాలువలు ఏర్పాటు చేసి నీళ్ళు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేసినారు. ఈ ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులకు నీళ్లు ఇవ్వకుండా వేరే ప్రాంతాలకి నీళ్లు ఇవ్వటం ఈ అన్యాయం, ఇండ్ల విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు ఇవ్వడం వేరే పార్టీ అయితే ఇల్లు ఇవ్వము అని చెప్పటం ఇది సిగ్గుమాలిన చర్య, ఇల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉన్నది, పార్టీల సంబంధం లేకుండా అర్హులైన పేదలందరూ కూడా పక్క గృహాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. కేంద్ర ప్రభుత్వం కావలసినంత యూరియా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన కూడా, ఇంకా యూరియా సరిపోర్టర్లు లేదంటే కేంద్ర ప్రభుత్వం 50 వేల మెట్రిక్ టన్నుల లో యూరియాని ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యానికి కప్పుపుచ్చుకోవడానికి యూరియా కొరత కేంద్ర ప్రభుత్వమే నేడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు వచ్చినా కూడా ఆ రాష్ట్రాల్లో యూరియా కొరత ఏర్పడుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలనకు నిదర్శనం, అర్హులైన అందరికీ పక్కా గృహాలు, పెన్షన్లు రేషన్ కార్డులు వెంటనే అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెల్లూరు కోటేశ్వరరావు డిమాండ్ చేసినారు.
ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ బిజెపి జిల్లా అధ్యక్షులతో కలిసి రైతుల పొలాలకు వెళ్లి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసపూరిత హామీలతో గద్దెనెక్కినది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చిలుకూరి రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, బిజెపి మండల అధ్యక్షుడు భూక్య రమేష్, నున్న రమేష్, దుదుకూరు కార్తీక్, మిశ్రా సిరుపరపు ప్రసాద్, తెల్లం నరసింహారావు, అన్నవరపు సత్యనారాయణ, నిమ్మటూరి రామారావు, ధారావత్ బాలకిషన్,భూక్య రాంబాబు, చరణ్, రవి, బిజెపి నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.


