కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 18, పున్నమి ప్రతినిధి
రామారెడ్డి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం బీసీలకు 42 శాతం రిజర్వే షన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ BC-జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాల నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.బీసీలకు న్యాయంగా 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలన్న డిమాం డ్‌తో ప్రభుత్వంపై నినాదాలు జారిపడ్డాయి. నాయ కులు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం ఇచ్చి న స్టే కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతోం దని ఆవేదన వ్యక్తం చేశారు.”బీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, రిజర్వేషన్ల సాధ న కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అని జేఏసీ నాయకులు తెలిపారు.దీనికి మద్దతు గా ఈ నెల 18న సంపూర్ణ బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వాల ని పిలుపునిచ్చారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందించారు. ప్రభుత్వ స్పందన ఆశించకుండా ఉంటే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.


