మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ తమ మాతృ మూర్తి కస్తాల మరియమ్మ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. మండల కేంద్రంలోని కుటుంబ ఘాట్ వద్ద మంగళవారం జరిగిన కార్యక్రమంలో వారు తమ తల్లి సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు పాల్గొని మరియమ్మ స్మృతులను స్మరించారు. ఈ సందర్భంగా మొండితోక సోదరులు మాట్లాడుతూ – తమ తల్లి సాదాసీదా జీవన విధానం, సేవా మనసు, కష్టానికి విలువ ఇచ్చే స్వభావం తమకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

తల్లి వర్థంతి సందర్భంగా ఘన నివాళులు