తల్లిదండ్రుల నిర్లక్ష్యం… మీ పిల్లలకే ప్రమాదం…..

0
129

బుచ్చిరెడ్డిపాలెము ఫిబ్రవరి 2 ( పున్నమి విలేఖరి)

పై ఫొటోలో చూడండి. ఒక మైనర్ బాలుడు ఇంకొక మైనర్ బాలున్ని బైక్ పై కూర్చోబెట్టుకుని రోడ్ల మీద తిరగడం. ఈ చిత్రం బుచ్చిరెడ్డిపాలెము పట్టణంలో ముంబై జాతీయ రహదారిపై అంబేద్కర్ విగ్రహం వద్ద తీసిన దృశ్యం. దీనికి ఎవరు సమాదానం ఇస్తారు.
కొందరి నిర్లక్షం వల్ల రోజు రోజుకూ పెరుగుతున్న యాక్షిడెంట్లు. బైక్ డ్రైవింగ్ అంటే ఏదో గొప్పగా నాకొడుకు బైక్ తోలుతున్నాడని నిర్లక్ష్యం వహిస్థే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. పర్యవసానం కొందరు తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తుంది. తల్లిదండ్రులారా దయచేసి ఆలొచించి, మీ ఇళ్లలో ఉండే మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి పంపడం మానుకొండి. అలాగే పోలీసు వారు కూడా ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు ప్రజానికం కోరుకుంటున్నాను.