Tuesday, 24 March 2026
  • Home  
  • తల్లితండ్రుల వద్దనుండి తప్పిపోయిన బాలుడిని — 30 నిమిషాల్లో సురక్షితంగా గుర్తించిన వెస్ట్ పోలీసులు.*
- తిరుపతి

తల్లితండ్రుల వద్దనుండి తప్పిపోయిన బాలుడిని — 30 నిమిషాల్లో సురక్షితంగా గుర్తించిన వెస్ట్ పోలీసులు.*

*తిరుపతి జిల్లా పోలీస్ శాఖ* తేదీ: 14.10.2025 – *తల్లితండ్రుల వద్దనుండి తప్పిపోయిన బాలుడిని — 30 నిమిషాల్లో సురక్షితంగా గుర్తించిన వెస్ట్ పోలీసులు.* – తిరుపతి రుయా హాస్పిటల్ వద్ద తల్లితండ్రుల వద్దనుండి తప్పిపోయిన చిన్న బాలుడిని తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించి తల్లితండ్రుల ఒడికి చేర్చారు. – తల్లితండ్రులు పోలీసులకు సమాచారం అందించగానే, వెస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ప్రాంగణం, సమీప ప్రాంతాలు, రోడ్లపై సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ చుట్టూ ప్రక్కల వెతికారు. కేవలం అర్థగంటలోనే బాలుడిని సురక్షితంగా గుర్తించి తల్లితండ్రులకు అప్పగించారు. – ఈ సందర్భంగా బాలుడి తల్లితండ్రులు కన్నీటి కళ్ళతో పోలీసులు చూపిన స్పందన, మానవతా విలువలు, సేవాస్ఫూర్తిని ప్రశంసిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. – జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు వెస్ట్ పోలీస్ సీఐ గారు,స్టేషన్ సిబ్బంది చూపిన వేగవంతమైన చర్యను అభినందించారు. చిన్న పిల్లలు లేదా పెద్దవారు తప్పిపోతే వెంటనే 112 నంబర్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. – *పోలీస్ వారి జాగ్రత్త సూచన:* – ప్రజలు ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, దేవాలయాలు వంటి జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చిన్నారులపై ఎప్పటికప్పుడు దృష్టి ఉంచాలి. తాత్కాలిక నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. చిన్నారుల భద్రత అంటే సమాజ భద్రత అని గుర్తుంచుకోవాలి. – *తిరుపతి జిల్లా పోలీస్* – *ప్రజల నమ్మకం – మా బలం*

*తిరుపతి జిల్లా పోలీస్ శాఖ*

తేదీ: 14.10.2025

– *తల్లితండ్రుల వద్దనుండి తప్పిపోయిన బాలుడిని — 30 నిమిషాల్లో సురక్షితంగా గుర్తించిన వెస్ట్ పోలీసులు.*

– తిరుపతి రుయా హాస్పిటల్ వద్ద తల్లితండ్రుల వద్దనుండి తప్పిపోయిన చిన్న బాలుడిని తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించి తల్లితండ్రుల ఒడికి చేర్చారు.

– తల్లితండ్రులు పోలీసులకు సమాచారం అందించగానే, వెస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ప్రాంగణం, సమీప ప్రాంతాలు, రోడ్లపై సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ చుట్టూ ప్రక్కల వెతికారు. కేవలం అర్థగంటలోనే బాలుడిని సురక్షితంగా గుర్తించి తల్లితండ్రులకు అప్పగించారు.

– ఈ సందర్భంగా బాలుడి తల్లితండ్రులు కన్నీటి కళ్ళతో పోలీసులు చూపిన స్పందన, మానవతా విలువలు, సేవాస్ఫూర్తిని ప్రశంసిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

– జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు వెస్ట్ పోలీస్ సీఐ గారు,స్టేషన్ సిబ్బంది చూపిన వేగవంతమైన చర్యను అభినందించారు. చిన్న పిల్లలు లేదా పెద్దవారు తప్పిపోతే వెంటనే 112 నంబర్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

– *పోలీస్ వారి జాగ్రత్త సూచన:*

– ప్రజలు ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, దేవాలయాలు వంటి జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చిన్నారులపై ఎప్పటికప్పుడు దృష్టి ఉంచాలి. తాత్కాలిక నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. చిన్నారుల భద్రత అంటే సమాజ భద్రత అని గుర్తుంచుకోవాలి.

– *తిరుపతి జిల్లా పోలీస్*
– *ప్రజల నమ్మకం – మా బలం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.