
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని నాగెళ్లముడుపు గ్రామానికి చెందిన బోగెం నాగమణి అనే మహిళ ఉరి వేసుకొని అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నట్లు తెలియజేశారు. విషయం తెలుసుకున్న తాడివారిపల్లి ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు వారి సిబ్బంది వాహనంలో సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలిని పరిశీలించి చనిపోవడానికి గల కారణాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భోగెము నాగమణి అనే మహిళ రాత్రి 11 గంటల సమయాన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందా లేక హత్యనా అని తెలియాల్సి ఉంది. మృతురాలి తల్లి మీనిగ లక్షమ్మ పిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలిని పరిశీలించామని ఈమెకు భర్త చెన్నకేశవులు, అబ్బాయి, అమ్మాయి ఉన్నారని తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణారెడ్డి, కానిస్టేబుల్ సత్యం, వీఆర్వో రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.