Thursday, 5 February 2026
  • Home  
  • తమ పే స్కేల్ డిమాండ్ కు సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క
- హైదరాబాద్

తమ పే స్కేల్ డిమాండ్ కు సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 తెలంగాణ సానుకూలంగా స్పందించి ఫైల్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు (MGNREGA-FTES) సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా దినోత్సవ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క తో శుక్రవారం బేటి అయ్యారు. గత 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో FTE లుగా పనిచేస్తున్న తమకు పే స్కేల్ వర్తింపచేయాలని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. కేవలం రూ. 30 కోట్లు ప్రతి సంవత్సరం అదనంగా వెచ్చిస్తే తమకు పే స్కేల్ అమలు చేయవచ్చని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క పే స్కేల్ కు సంబంధించిన ఫైల్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పే స్కేల్ పై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న చిరు ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. అయితే పలు సాంకేతిక సమస్యలను కారణంగా చూపుతూ పే అండ్ అకౌంట్స్ సెక్షన్ తమ జీతాల చెల్లింపుల్లో జాప్యం చేస్తుందని FTES లు మంత్రికి మోర పెట్టుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క పే అండ్ అకౌంట్స్ సెక్షన్ అధికారులతో మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలతో చిరు ఉద్యోగుల జీతాలు ఆపొద్దని, మానవత దృక్పథంతో వ్యవహరించి జీతాలు చెల్లించాలని ఆదేశించారు.

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 తెలంగాణ
సానుకూలంగా స్పందించి ఫైల్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క
తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు (MGNREGA-FTES) సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా దినోత్సవ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క తో శుక్రవారం బేటి అయ్యారు. గత 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో FTE లుగా పనిచేస్తున్న తమకు పే స్కేల్ వర్తింపచేయాలని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. కేవలం రూ. 30 కోట్లు ప్రతి సంవత్సరం అదనంగా వెచ్చిస్తే తమకు పే స్కేల్ అమలు చేయవచ్చని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క పే స్కేల్ కు సంబంధించిన ఫైల్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పే స్కేల్ పై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న చిరు ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.
అయితే పలు సాంకేతిక సమస్యలను కారణంగా చూపుతూ పే అండ్ అకౌంట్స్ సెక్షన్ తమ జీతాల చెల్లింపుల్లో జాప్యం చేస్తుందని FTES లు మంత్రికి మోర పెట్టుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క పే అండ్ అకౌంట్స్ సెక్షన్ అధికారులతో మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలతో చిరు ఉద్యోగుల జీతాలు ఆపొద్దని, మానవత దృక్పథంతో వ్యవహరించి జీతాలు చెల్లించాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.