Sunday, 29 March 2026
  • Home  
  • తమిదల కుటుంబ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ – వరుడికి ఆశీస్సులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తమిదల కుటుంబ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ – వరుడికి ఆశీస్సులు

వింజమూరు మండలం, చండ్రపడియ పంచాయితీ పరిధిలోని తొగటపాలెం గ్రామంలో జరిగిన తమిదల కుటుంబ వివాహ వేడుకల్లో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొన్నారు. తమిదల విజయ భాస్కర్ రెడ్డి – శ్రీమతి అనిత దంపతుల కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి గంధపు నలుగు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, వరుడికి అక్షింతలు వేసి ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. వరుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఎదగాలని, వివాహ జీవితం ఆనందంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వింజమూరు మండలం, చండ్రపడియ పంచాయితీ పరిధిలోని తొగటపాలెం గ్రామంలో జరిగిన తమిదల కుటుంబ వివాహ వేడుకల్లో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొన్నారు. తమిదల విజయ భాస్కర్ రెడ్డి – శ్రీమతి అనిత దంపతుల కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి గంధపు నలుగు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, వరుడికి అక్షింతలు వేసి ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. వరుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఎదగాలని, వివాహ జీవితం ఆనందంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.