తనశాంతమె-తనకురక్ష.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.

0
285

శాంతము గలవారు ఎంతటి కష్టతరమైన కార్యాన్నిసాధించగలరు . శాంతమూర్తులు దయాదాక్ష్యణ్యాలు, జాలీ,సానుభూతి, సేవాభావం, ఉపకారబుధ్ధికలిగిఉంటారు.”కోపమున ఘనత కొంచమైపోవును “అన్నాడు వేమన.”తనకోపమెతనశత్రువు-తనశాంతమె తనకురక్ష” అంటాడు సుమతిశతక కర్త.”శాంతమూ లేక సౌఖ్యములేదు”అంటారు త్యాగయ్య.కలహం,కలత-కల్లోలం-దౌర్జన్యం-భయం-దురాశ- ఇవన్ని మనిషికి నెమ్మదిలేకుండాచేస్తాయి.నిరాశ,నిస్పుహ,ఆవహింపబడి నరకప్రాయమైన జీవితం లభిస్తుంది.శాంతమూర్తిఅయినవారు సమాజపరంగా ఎంతోగౌరవింపబడతారు.
శాంతమె జనులను జయము నొందించును
శాంతముననె గురుని జాడతెలియు
శాంత భావ మహిమ చర్చింప లేమయా
విశ్వదాభిరామ వినురవేమ!
శాంతమూర్తిఅయిన బుధ్ధుడు దేశాటనచేస్తూ అడవిమార్గన వెళుతూ,దారిలోని ఒచెరువు గట్టున ఉన్న చెట్టునీడలో ధ్యానంచేస్తూ కూర్చున్నాడు.అదేబాటన గుర్రంపైవెళుతున్న ఆదేశరాజు, ధ్యానంలోఉన్నబుద్ధునిచూసి “ఏయ్ దొంగసన్యాసి కళ్లుతెరువు పనికి సోమరులై తేరగాదొరికే తిండి తింటూ బ్రతికేవాళ్లు సమాజానికి చీడపురుగులు నీలానేనుఉంటే ఇన్ని భయంకరయుధ్ధాలు చేసేవాడినా ఇంతసువిశాల రాజ్యంస్ధాపించేవాడినా”అంటూ పలుదుర్బాషలాడాడు. కళ్లుతెరిచిన బుద్దుడు”కూర్చోండి మహారాజా నన్ను తిట్టి అలసిపోయారు. ఈచల్లని నీరుతాగి సేదతీరండి”అన్నాడు .రాజుకు కోపంపోయింది నేను ఇంతగా తిట్టినా ఇతను యింత శాంతంగా ఎలా ఉండగలిగాడు అనుకున్నాడు. అదిగమనించినబుద్దుడు చిరునవ్వుతో”నాయనా ఇంతకుమునుపు కొందరు తీపిపదార్ధాలు తీసుకువచ్చి నన్ను స్వీకరించమన్నారు.నేను తిరస్కరించాను.వాటినివారే తిరిగితీసుకువెళ్లారు.ఇప్పుడు అలనా నే నీతిట్లను నేను స్వీకరించడంలేదు”అన్నాడు.చేతులు జోడించిన మహారాజు “అయ్యనన్నుమీశిష్యుడిగా స్వీకరించండి.కోపము,ఆశ,అసూయ,భయం మొదలైనగుణాలు అశాంతికి గురిచేస్తాయి.సంతృప్తి,శాంతి,ప్రేమ ఆనందాన్నికలిగిస్తాయి అనితెలుసుకున్నాను.అన్నాడు .ప్రేమగా అతన్ని ఆశీర్వదించాడుబుధ్ధుడు.రాజుమనసు మారింది రక్తపాతాలుజరిపిన వాడు శాంతమూర్తిగామారిపోయాడు.బాలలు ఆరాజు ఎవరోతెలుసా? అతనే ‘అశోకచక్రవర్తి’

బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.

 

0
0