తణుకు చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి కోట రామ ప్రసాద్ మాతృభాష తెలుగు ప్రాముఖ్యతను వివరించారు. వివిధ భాషా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ డా. రవీంద్రబాబు అధ్యక్షతన అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో కోట రామ ప్రసాద్‌ను సత్కరించారు.



