అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలంలోని రైతు సేవా కేంద్రం నందు రబీ పంటలకు, యూరియా పంపిణీ పై రైతులకు, అధికారులకు, రైతు సేవా కేంద్రం సిబ్బందికి మరియు డీలర్లకు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు కే. శివ నాయక్ (ఎడిఎ) మాట్లాడుతూ వరి పంటకు రైతులు ప్రభుత్వం సిఫారసు చేసిన మోతాదులోనే యూరియా వాడుకోవాలని అధికంగా వాడటం వలన, కలిగే నష్టాల గురించి వివరించారు. ఎకరాకి మూడు బస్తాలు మాత్రమే వాడాలని తెలిపారు. వ్యవసాయ అధికారి హిమబిందు మాట్లాడుతూ, రైతులకు తగినంత యూరియా అందుబాటులో ఉంటుందని మరియు రైతు సేవా కేంద్రము మరియు ప్రైవేటు డీలర్ల వద్ద చేజర్ల మండలానికి అవసరమైన యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు. రైతులు ఎవరు కూడా అపోహాలు నమ్మి కంగారు పడకుండా వ్యవసాయ సిబ్బంది నుండి యూరియా కార్డ్స్ తీసుకొని వరి పంట సాగు చేసే విస్తీర్ణానికి ఎకరాకి మూడు బస్తాలు విడతల వారీగా పంపిణీ ఉంటుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ సిబ్బంది ఎఈఓ, విఎఎలు, ఎరువుల డీలర్స్ పాల్గొన్నారు.


