తక్షశిల హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.
వెల్దండ నవంబర్ 14 :
భారతదేశపు తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి ని పురస్కరించుకుని వెల్దండ మండల కేంద్రంలోని తక్షశిల హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులై పాఠాలు బోధించి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తక్షశిల హై స్కూల్ ప్రిన్సిపాల్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి బావి భారత పౌరులని, భారతదేశ మొట్టమొదటి మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి బాలలను సమాజానికి వెలుగు చూపే దీపాలని, వారి ప్రతిభ ,సృజనాత్మకత దేశ అభివృద్ధికి పునాదులను చాటిచెప్పిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ కి పిల్లలపై ఉన్న ప్రేమ ప్రగతిశీల ఆలోచనలు మనందరికీ స్ఫూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేష్ నాయర్ , ఉపాధ్యాయులు శేఖర్, మల్లేష్, శ్రీదేవి, దివ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


