నందిగామ మంగళవారం: నందిగామ సబ్‌డివిజన్ పరిధిలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు మంగళవారం రోజు విచారణలో, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పై 2019–2024 మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన లో పెట్టిన అక్రమ కేసులను కోర్టు కొట్టివేసింది. ఆ సమయంలో, కంచికచర్ల మరియు పేరకలపాడు ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసిన సౌమ్య పై రాజకీయ ప్రతీకారంగా తప్పుడు కేసులు నమోదు చేశారని విమర్శలు వెలువడ్డాయి. విచారణ అనంతరం జడ్జ్ కేసులలో చట్టపరమైన ఆధారం లేనని తేల్చి వాటిని రద్దు చేశారు. ఈ తీర్పుతో తంగిరాల సౌమ్య అనుచరులు, కూటమి నాయకులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తంగిరాల సౌమ్య, “నిజం ఎప్పటికీ గెలుస్తుంది. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను ఎల్లప్పుడూపోరాడుతాను. తప్పుడు కేసులు నన్ను వెనక్కి తగ్గించలేవు,” అన్నారు. కోర్టు తీర్పు, శాంతియుత నిరసన లను పోలీస్ లేదా రాజకీయ పీడనంతో అడ్డుకోవడం సరికాదు అని స్పష్టం చేసింది.

తంగిరాల సౌమ్యపై పెట్టిన కేసులు కోర్టు కొట్టివేత; ప్రజాస్వామ్య హక్కులు రక్షితమని తీర్పు