-‘ఇది పిరికిపంద చర్య’ – మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
చిట్వేల్/, నవంబర్ 11: పున్నమి ప్రతినిధి
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద సోమవారం రాత్రి జరిగిన కారు బాంబు పేలుళ్ల సంఘటన** అత్యంత అమానుషమని చిట్వేలి మండల జనసేన నాయకులు మాదాసు నరసింహ తీవ్రంగా ఖండించారు.
ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమాయక ప్రజలు 9 మంది మృతి చెందడం మరియు 20 మందికి పైగా గాయాలబారిన పడటం తీవ్ర విచారకరమన్నారు.
-అమానవీయ చర్య:
“ఏమాత్రం దయ, కనికరం లేకుండా, అన్యం పుణ్యం ఎరుగని సామాన్య ప్రజల పట్ల ఇంతటి క్రూరంగా వ్యవహరించడం పిరికిపంద చర్య గా ఆయన అభివర్ణించారు. దేశ భద్రతను ఉల్లంఘిస్తూ, పౌరుల ప్రాణాలను తీయడం అత్యంత హేయమైన చర్య” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
-డిమాండ్‌లు:
ఈ పేలుళ్లకు బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరపున తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామన్నారు.ఇటువంటి అమానవీయ సంఘటనలను రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ తీవ్ర స్థాయిలో ఖండించాలని, ఉగ్రవాద చర్యలను అణిచివేసేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.


