*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*జనసేన పార్టీ నగర కార్యలయంలో జనసేన, ABVP, TNSF విద్యార్థి సంఘల మీడియా సమావేశంలో ముఖ్యంశాలు*
* *డ్రగ్ ఫ్రీ విశాఖపట్నం కోసం* *విద్యాలయాలలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాం,*
* *విద్యార్థి సంఘాల నాయకులు దేశంకోసం త్యాగం చేసిన నాయికుల కోసం చెప్పాలి కానీ, విద్యార్థుల భవిష్యత్తు దారి తప్పేలా వ్యవహరించరాదు*,
డా, మర్రివేముల శ్రీనివాస్, జనసేన నాయకులు, మాట్లాడుతూ…
* విశాఖ రూప్ రేఖలు మారుతున్న తరుణంలో పడగ విప్పిన డ్రగ్స్ కల్చర్,
* “పార్టీ పేరుతో యువతను డ్రగ్స్ బానిసలుగా మార్చిన వైసీపీ నాయకత్వం సిగ్గు పడాలి”,
* రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రించే కార్యాచరణకు అన్ని యువజన, విద్యార్థి సంఘాలతో పాటు మేధావులచే సదస్సులు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియచేసారు,
ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రం గా చేయాలనీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని దానికి విద్యార్థులు, యువత సహకరించాలని అన్నారు.*
*ABVP నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబెర్,కిరణ్ కుమార్ మాట్లాడుతూ….
* విశ్వ విద్యాలయ కేంద్రంగా జరుగుతున్నా డ్రగ్స్ దందా పై ఉక్కు పదం మోపుతూ టాస్క్ ఫోర్స్ ప్రతి 3 నెలలకు ఒక సారి యూనివర్సిటీలు మరియు కళాశాలలు ను పర్య వెక్షించాలని కోరారు,
“విశాఖలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి,
* google లాంటి ప్రతిష్టాత్మక డేటా సెంటర్, కాగ్నిజెంట్, సిఫి, ఐటీ పరిశ్రమలు కేరాఫ్ గా ఉన్న విశాఖను డ్రగ్స్ కు అడ్డాగా యువతను, స్టూడెంట్స్ ని బానిస చేసే కుట్రలో వైసిపి,
* ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారం బయట పడటం తో అన్ని విద్యార్థి సంఘాలు అసహనం వ్యక్తం చేసాయి.
*TNSF పార్లమెంట్ ప్రసిడెంట్,రత్న కాంత్ మాట్లాడుతూ….
* కుటమి ప్రభుత్వ అధికారం లోకి వచ్చాక విశాఖలో యాంటీ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే ఇదే విశాఖపట్నం ను మొత్తం మాఫియాగా తయారు చేయాలనుకుంటున్నారా?
* యువత భవిష్యత్తు కోసం శ్రమించాలి కానీ వారు భవిష్యతే నాశనం చేసే విధంగా వైసిపి నాయకులు పాటుపడుతున్నారు,
* ఈ కేసులో ఎంత పెద్ద వారైనా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి.. అన్నారు.
ఈ కార్యక్రమం లో
ABVP డిస్ట్రిక్ట్ కన్వీనర్,నితిన్,
సిటీ సెక్రటరీ,ప్రసాద్,
టెక్నికల్ స్టేట్ కో కన్వీనర్,వెంకటేష్,
AU ఆర్ట్స్ కాలేజీ ప్రసిడెంట్,వెంకయ్యనాయుడు,
TNSF వైస్ ప్రసిడెంట్,అవినాష్,
స్పాక్స్ పర్సన్ బి. ప్రవీణ్, అర్జీనైజషన్ సెక్రటరీ,భావత,
జనసేన నాయకులు పోతు ప్రసాద్, దేవర రఘు మరియు విద్యార్థి సంఘల నాయకులు పాల్గొన్నారు.


