శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీ కాళహస్తిపట్టణంలో నిర్వహిస్తున్న “మాదకద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ యాత్ర”కు భాగంగా జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు, అధికారులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయని హెచ్చరించారు. యువత పూర్తిగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇవి వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. యువత తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా యాత్రను చేపట్టిన విజయ్ కలాం కు ఘనంగా వీడ్కోలు పలికారు. విద్యార్థులు, యువత కలిసి మాదకద్రవ్యాల వ్యతిరేక నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ యాత్ర యువతలో చైతన్యం పెంపొందించి సమాజంలో సానుకూల మార్పుకు దోహదం చేస్తుందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం ముగింపులో యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు.

డ్రగ్స్ వ్యతిరేక యాత్రకు ఘన వీడ్కోలు – యువతకు అవగాహన సందేశం