Tuesday, 24 March 2026
  • Home  
  • డ్రగ్స్ వద్దు బ్రో. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా.అవగాహన సదస్సు.
- కడప

డ్రగ్స్ వద్దు బ్రో. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా.అవగాహన సదస్సు.

జిల్లా ఎస్పీ శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కడప నగరం రాధాకృష్ణ నగర్ లోని బాలుర సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నెంబర్ 3 విద్యార్థులకు డ్రగ్స్,మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమంనిర్వహించారు.జిల్లా’ఈగల్’ బృందం,మరియు నార్కోటిక్ బృందము స్థానిక1టౌన్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో,డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించాలని అధికారులు కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులపాత్రచాలాముఖ్యమైనదని,రేపటి సమాజరూపకర్తలు నేటి విద్యార్థులేనని విద్యార్థులు బాగా చదివి సమాజానికి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని,మత్తు పదార్థాల బారినపడి తమజీవితాలను కుటుంబాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా విద్యార్థులకు హెచ్చరించడం జరిగింది.మీ సమీప ప్రాంతాల్లో ఎక్కడైనా డ్రగ్స్ దుర్వినియోగం జరుగుతున్నట్లు మీకు తెలిసిన యెడల టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి కాల్ చేసి వివరాలుతెలియజేయాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు హాస్టల్ వార్డెన్ డ్రగ్స్ నివారణలోభాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రమేష్ బాబు,1టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ ప్రతాపరెడ్డి వారి సిబ్బంది,నార్కోటిక్ సెల్ నుండిఏఎస్ఐమల్లయ్య,ఈగల్ బృందం సభ్యులు అయూబ్ ఖాన్,గురు శేఖర్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.