ఇవి ఎక్కువగా ఉదయం 5.00 నుండి 7.00 గంటల వరకు మరియు సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు కుడుతాయి.
డెంగ్యూ జ్వరం అనేది డెంగ్యూ వైరస్ వల్ల వచ్చే ఒక వైరల్ వ్యాధి. ఈ వైరస్ మనుషులకు ఎడిస్ ఈజిప్టి అనే దోమ కాటు ద్వారా సంక్రమిస్తుంది. ఈ దోమలు సాధారణంగా శుభ్రమైన నీటిలో పెరుగుతాయి — అంటే నీటి ట్యాంకులు, డబ్బాలు, కూలర్‌లు వంటి ప్రదేశాల్లో. ఇవి ఎక్కువగా ఉదయం 5.00 నుండి 7.00 గంటల వరకు మరియు సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు కుడుతాయి. సాధారణంగా ఇవి మోకాళ్ల కింద భాగం మరియు మోచేతి కింద భాగం వద్ద కుడతాయి.
ఈ దోమ కుట్టిన వారం రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. మొదటగా 103° నుండి 106° వరకు జ్వరం వస్తుంది. శరీరమంతా తీవ్రమైన నొప్పులు, కనుగుడ్ల వెనుక భాగంలో నొప్పి, వాంతులు, బలహీనత వంటి సమస్యలు కనిపిస్తాయి. రక్తంలోని ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గడం కూడా ప్రధాన లక్షణం. సాధారణంగా 1 మిల్లీలీటర్ రక్తంలో 1.5 లక్షల నుండి 4.5 లక్షల వరకు ప్లేట్‌లెట్స్ ఉంటాయి.
ప్లేట్‌లెట్స్ 50,000 వరకు తగ్గితే భయపడవలసిన అవసరం లేదు, కానీ దానికంటే తక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించి హాస్పిటల్‌లో చికిత్స తీసుకోవాలి, అవసరమైతే ప్లేట్‌లెట్ ఎక్కించుకోవాలి.
100 మంది డెంగ్యూ రోగులలో 90 మందికి పెద్ద చికిత్స అవసరం లేకుండానే నయం అవుతుంది. ఈ వ్యాధికి ప్రత్యేకమైన మందులు లేవు. కాబట్టి జ్వరాన్ని కంట్రోల్ చేయడం, సెలైన్ పెట్టడం, బీపీ నియంత్రణ, అవసరాన్ని బట్టి రక్త కణాలు ఎక్కించడం వంటి సహాయక చికిత్సలే ప్రధానమైనవి.
జాగ్రత్తలు — దోమల నివారణే రక్షణ!


