Thursday, 5 February 2026
  • Home  
  • డీఎస్సీలో భర్తీకాని…700 పోస్టులు!
- ఆంధ్రప్రదేశ్

డీఎస్సీలో భర్తీకాని…700 పోస్టులు!

దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ నేడు, రేపు మూడో విడత సర్టిఫికెట్ల పరిశీలన సెప్టెంబర్ 03పున్నమి ప్రతినిధి @అమరావతి : మెగా డీఎ స్సీలో ప్రకటించిన 16,347 పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారు 700 పోస్టులు మిగిలే పరిస్థితి పరిస్థితి కనిపి కనిపిస్తోంది! ఇప్పటివరకూ జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనతో అధికారులు ఈ అంచనాకు వచ్చారు. కాగా.. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. రెండో విడతలో 627 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా.. మంగళవారానికి వారిలో 480 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి, సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభి స్తారు. మొత్తంగా 15,600 మంది అభ్యర్థులే ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన పోస్టులను తర్వాత డీఎ స్సీలో భర్తీ చేస్తారు. కాగా.. కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈలోపే వారు పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారి జాబితాలు ప్రకటిస్తారు.

దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ

నేడు, రేపు మూడో విడత సర్టిఫికెట్ల పరిశీలన

సెప్టెంబర్ 03పున్నమి ప్రతినిధి @అమరావతి :
మెగా డీఎ స్సీలో ప్రకటించిన 16,347 పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారు 700 పోస్టులు మిగిలే పరిస్థితి పరిస్థితి కనిపి కనిపిస్తోంది!

ఇప్పటివరకూ జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనతో అధికారులు ఈ అంచనాకు వచ్చారు.

కాగా.. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది.

రెండో విడతలో 627 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా.. మంగళవారానికి వారిలో 480 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది.

బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి, సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభి స్తారు.

మొత్తంగా 15,600 మంది అభ్యర్థులే ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది.

మిగిలిన పోస్టులను తర్వాత డీఎ స్సీలో భర్తీ చేస్తారు.

కాగా.. కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

ఈలోపే వారు పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంది.

మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారి జాబితాలు ప్రకటిస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.