విజయవాడ / రాజమహేంద్రవరం నవంబర్, 06
– ఆసుపత్రి అభివృద్ధి, సిబ్బంది బలోపేతం అంశాలపై చర్చ.
తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జిజిహెచ్) ఇంచార్జి సూపరింటెండెంట్ డా. పి.వి.వి. సత్యనారాయణ గురువారం విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయం లో డీఎంఈ డా. జి. రఘు నందన రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, వైద్య సిబ్బంది బలోపేతం, ఆధునిక పరికరాల అందుబాటు, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఆసుపత్రిలో సేవల నాణ్యతను మరింత పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూపరింటెండెంట్ సమగ్ర వివరాలు సమర్పించారు.
తూర్పు గోదావరి జిల్లా జిజిహెచ్ ఇంచార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈ అనంతరం తొలిసారిగా డీఎంఈ వారిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు డా. పి.వి.వి. సత్య నారాయణ తెలియ చేశారు.


