డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఈరోజు జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గుబ్బల సూర్యప్రకాశ్ గారు సందర్శించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రత, బోధనా విధానం, విద్యార్థుల హాజరు, మరియు సమ్మెటివ్ అసెస్మెంట్-1 పరీక్షల నిర్వహణపై ఆయన సమీక్ష చేశారు. విద్యార్థులతో పరస్పర ముచ్చట చేస్తూ వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సూచనలు ఇచ్చారు. పాఠశాల ఆవరణను పరిశీలిస్తూ పచ్చదనం మరియు పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యార్థుల్లో పోటీ భావన, నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్శనలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గుబ్బాల సూర్యప్రకాశ్ అప్పనపల్లి ZPHS పాఠశాల సందర్శన