రాష్ట్రవ్యాప్తంగా నూతన డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.చిత్తూరు జిల్లాలో డీడీవో కార్యాలయాన్ని స్వయంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.అదే తరహాలో రాజంపేట మండలంలో డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస రాజు
గ్రామీణ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ చేపట్టిన నిర్ణయాలు ఎంతో దిశానిర్దేశకంగా ఉన్నాయి.గ్రామాల్లో రహదారులు,తాగునీటి సౌకర్యాలు,ఆరోగ్య సేవలు, అన్ని మౌలిక వసతులను మెరుగుపరుస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వంలో భాగం అవ్వడం నా అదృష్టం. ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు.ఈ
కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, మాజీ జెడ్పిటిసి షబ్బీర్ అహ్మద్,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూబకర్ మండెం,అల్లం సుబ్రహ్మణ్యం, శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసు కార్యాలయ ప్రారంభంలో పాల్గొన్న యల్లటూరు శ్రీనివాస రాజు
రాష్ట్రవ్యాప్తంగా నూతన డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.చిత్తూరు జిల్లాలో డీడీవో కార్యాలయాన్ని స్వయంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.అదే తరహాలో రాజంపేట మండలంలో డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస రాజు గ్రామీణ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ చేపట్టిన నిర్ణయాలు ఎంతో దిశానిర్దేశకంగా ఉన్నాయి.గ్రామాల్లో రహదారులు,తాగునీటి సౌకర్యాలు,ఆరోగ్య సేవలు, అన్ని మౌలిక వసతులను మెరుగుపరుస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వంలో భాగం అవ్వడం నా అదృష్టం. ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, మాజీ జెడ్పిటిసి షబ్బీర్ అహ్మద్,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూబకర్ మండెం,అల్లం సుబ్రహ్మణ్యం, శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

