30.01.2026 చుట్టుగుంట విజయవాడ *
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ నందు దీర్ఘకాలంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సేవలందించి విధినిర్వహణలో రాష్ట్రస్థాయి ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు, ఆగస్టు 15 జనవరి 26 రాష్ట్ర పర్వదినాల్లో వైద్యారోగ్య శాఖ తయారు చేసే శకటాల తయారీలో చేసిన కృషికి గుర్తింపుగా రాష్ట్ర ఉన్నతాధికారుల మన్ననలు పొంది గత నెలలో కడప జోన్ లో డిప్యూటీ డెమోగా పదోన్నతి పొందిన శుభసందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ పద్మావతి గారి ఛాంబర్ నందు మేడం గారిచే శివరామరాజు డిప్యూటీ డెమో గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు డబ్ల్యూ. వెంకటరమణ, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చేజర్ల సుధాకర్ రావు, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ జయ ప్రకాష్, స్టేట్ ట్రెజరర్ నున్న హరిప్రసాద్ గార్లు శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్టేట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి గారు మాట్లాడుతూ శివరామరాజు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా గొప్పగా సేవలు అందించారు అని వారి సేవలు అభినందనీయమని కొనియాడారు.


