అద్దె బస్సు డ్రైవర్ల జీతాలు పెంచాలని వాల్తేర్ డిపోలో సమ్మె నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వంటావార్పు కార్యక్రమం చేపట్టి ఆర్టీసీ అధికారులు గానీ, అద్దె బస్సు యజమానులు గాని చర్చలకు ఆహ్వానించి డిమాండ్స్ పరిష్కరించడంలో ముందుకు రావటం లేదని విమర్శించారు. ఇప్పటికే మద్దిలపాలెం, సింహాచలం డిపోలలో అద్దె బస్సు డ్రైవర్లు జీతాలు పెంచాలని ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చారని జిల్లావ్యాప్తంగా అద్దె బస్సు డ్రైవర్ల జీతాలు పెంచి డిమాండ్స్ ఆమోదించకపోతే అన్ని డిపోలలో సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీలో ఆన్ కాల్ డ్రైవర్ కి 8 గంటల డ్యూటీకి 1000 జీతం చెల్లిస్తే అదే డ్రైవర్ డ్యూటీ చేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లకు 600 మాత్రమే ఒక డ్యూటీ కి చెల్లిస్తున్నారని విమర్శించారు. ఒకే రకమైన డ్యూటీ చేస్తున్న వారికి ఒకే రకమైన జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అద్దె బస్సు యజమానులు చర్చలకు వచ్చి జీతాలు పెంపుదలతో పాటు ఇతర డిమాండ్స్ ఆమోదించాలని లేనియెడల ఆర్టీసీ ఆర్.ఎం ఆఫీసు లేబర్ ఆఫీస్ వద్ద ధర్నాలు నిర్వహించి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) మద్దిలపాలెం జోన్ గౌరవ అధ్యక్షులు పి. వెంకటరావు, హైర్ బస్ డ్రైవర్స్ అసోసియేషన్ వాల్తేర్ డిపో అధ్యక్షుడు, కార్యదర్శులు బి. జంపన్న, పి. రఘు, మద్దిలపాలెం డిపో అధ్యక్ష కార్యదర్శులు జే.కృష్ణ, సిహెచ్.తేజ మరియు అద్దె బస్సు డ్రైవర్లు అందరూ పాల్గొన్నారు.

డిపోలో 4వ రోజుకి చేరిన అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె.