నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు, నక్కలగండి తండా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరిశీలించారు. గత నెల కురిసిన భారీ వర్షాల కారణంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరద పరిస్థితిని ఆమె పరిశీలించారు. ముఖ్యంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన నక్కలగండి తండా, అలాగే రిజర్వాయర్ కట్టను ఆమె పరిశీ లించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు 95% పూర్తయినందున తక్కిన ఐదు శాతం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. ఈ సందర్భంగా డిండి ప్రాజెక్టు దిగువ బాగాన ఉన్న రైతులు జిల్లా కలెక్టర్ ను కలిసి ఊట నీటి కారణంగా తమకు ఇబ్బంది కలుగుతుందని, తమకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంచాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, పర్యవేక్షక ఇంజనీర్ బద్రు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ, డి ఈ చక్రపాణి, పవన్ తదితరులు ఉన్నారు.

డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను పరిశీలించిన : కలెక్టర్
నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు, నక్కలగండి తండా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరిశీలించారు. గత నెల కురిసిన భారీ వర్షాల కారణంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరద పరిస్థితిని ఆమె పరిశీలించారు. ముఖ్యంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన నక్కలగండి తండా, అలాగే రిజర్వాయర్ కట్టను ఆమె పరిశీ లించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు 95% పూర్తయినందున తక్కిన ఐదు శాతం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. ఈ సందర్భంగా డిండి ప్రాజెక్టు దిగువ బాగాన ఉన్న రైతులు జిల్లా కలెక్టర్ ను కలిసి ఊట నీటి కారణంగా తమకు ఇబ్బంది కలుగుతుందని, తమకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంచాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, పర్యవేక్షక ఇంజనీర్ బద్రు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ, డి ఈ చక్రపాణి, పవన్ తదితరులు ఉన్నారు.

