కొమురం భీమ్ జిల్లా (పున్నమి ప్రతినిధి ) ఈ రోజు కాగజనగర్ లోని డాడా నగర్ లో గల కుమురం భీమ్ విగ్రహం వద్ద ఘనంగా కుమురం భీమ్ 85 వ వర్ధంతిని భీమ్ విగ్రహానికి పూల మాలలు వేసి అనంతరం పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీఎంస్ వైస్ చైర్మన్ కుమురం మాంతయ్య గారు పాల్గొన్నారు…
వారు మాట్లాడుతూ కుమురం భీమ్ ఆశయాలతో మనం కలిసి కట్టుగా, ఐక్యమత్యంతో ముందుగు నడవాలని, వారి యొక్క పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. వారి వెంట కాగజ్ నగర్ మండలానికి చెందిన మాజీ సర్పంచులు రామ్ షా, భగవంత్ రావ్, భీంరావ్, అర్జు, భీమన్న వివిధ గ్రామాల సర్ మేడిలు, మోకాసిలు, పటేల్ లు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు…
ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి.✊
జై కుమురం భీమ్…✊✊


