Monday, 8 December 2025
  • Home  
  • డాక్టర్ పీర్ కుమార్ ని వరించిన డా. రాధాకృష్ణన్, ఎన్టీఆర్ జాతీయ సేవా అవార్డులు
- ఎన్ టి ఆర్ జిల్లా

డాక్టర్ పీర్ కుమార్ ని వరించిన డా. రాధాకృష్ణన్, ఎన్టీఆర్ జాతీయ సేవా అవార్డులు

సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి @ విజయవాడ విశాఖపట్నం డాబా గార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాణ కేంద్రం నందు ఆదివారం సాయంత్రం శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ37వ వార్షికోత్సవాల సందర్భంగా డాక్టర్ బద్రి పీర్ కుమార్ ను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎక్సలెన్స్ అవార్డుతో కళాపరిషత్ నిర్వహకులు సత్కరించారు. అధ్యాపకుడిగానే కాక నాటక, టీవీ, సినీ నటుడిగా, రచయితగా, గేయ రచయితగా, నాటక దర్శకుడిగా, కళా రంగానికి చేస్తున్న సేవలను గుర్తించిన మా కమిటీ ఈ అవార్డుకి పీర్ కుమార్ ని ఎంపిక చేసిందని కళా భూషణ్ డాక్టర్ పి.ఎ. భాస్కర రావు తెలిపారు. అదేవిధంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన మదర్ సర్వీస్ సొసైటీ వారి 3వ వార్షికోత్సవం వేడుకలు విజయవాడ లోని నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కళాకేంద్రంలో సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు, కేరళ, ఒరిస్సా, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, ఆంద్రప్రదేశ్, రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాలలో సేవ చేస్తున్న వారికి సేవా అవార్డుల ప్రదానం లో భాగంగా డాక్టర్ బద్రి పీర్ కుమార్ ను ఎన్టీఆర్ జాతీయ సేవా పురస్కారంతో పలువురు ప్రముఖులు సత్కరించారు. A.P. SC కమీషన్ ఛైర్మన్, మాజీ మంత్రి వర్యులు అయిన కొత్తపల్లి శ్యామ్యుల్ జవహార్, మదర్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మల్లాది ప్రసాదరావు, హీరోయిన్ రజిత పాండే, సీనియర్ నటులు పృథ్వీరాజ్, నేటి అమరావతి దినపత్రిక చీఫ్ ఎడిటర్ మున్నం చిన సుబ్బారెడ్డి, నటుడు నిర్మాత డాక్టర్ మూసా అలీ ఖాన్, ప్రముఖ మిమిక్రీ స్టార్ తోట సిల్వర్ స్టార్, ఎన్వి సురేంద్రబాబు, నేటి శుభోదయం దినపత్రిక చీఫ్ ఎడిటర్ గోంగూర శ్రీనివాసరావు, సినీ ప్రొడ్యూసర్ డాక్టర్ ఎస్ కే జలీల్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయిరేణి శ్రావణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి @ విజయవాడ
విశాఖపట్నం డాబా గార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాణ కేంద్రం నందు ఆదివారం సాయంత్రం శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ37వ వార్షికోత్సవాల సందర్భంగా డాక్టర్ బద్రి పీర్ కుమార్ ను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎక్సలెన్స్ అవార్డుతో కళాపరిషత్ నిర్వహకులు సత్కరించారు. అధ్యాపకుడిగానే కాక నాటక, టీవీ, సినీ నటుడిగా, రచయితగా, గేయ రచయితగా, నాటక దర్శకుడిగా, కళా రంగానికి చేస్తున్న సేవలను గుర్తించిన మా కమిటీ ఈ అవార్డుకి పీర్ కుమార్ ని ఎంపిక చేసిందని కళా భూషణ్ డాక్టర్ పి.ఎ. భాస్కర రావు తెలిపారు. అదేవిధంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన మదర్ సర్వీస్ సొసైటీ వారి 3వ వార్షికోత్సవం వేడుకలు విజయవాడ లోని నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కళాకేంద్రంలో సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు, కేరళ, ఒరిస్సా, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, ఆంద్రప్రదేశ్, రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాలలో సేవ చేస్తున్న వారికి సేవా అవార్డుల ప్రదానం లో భాగంగా డాక్టర్ బద్రి పీర్ కుమార్ ను ఎన్టీఆర్ జాతీయ సేవా పురస్కారంతో పలువురు ప్రముఖులు సత్కరించారు. A.P. SC కమీషన్ ఛైర్మన్, మాజీ మంత్రి వర్యులు అయిన కొత్తపల్లి శ్యామ్యుల్ జవహార్, మదర్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మల్లాది ప్రసాదరావు, హీరోయిన్ రజిత పాండే, సీనియర్ నటులు పృథ్వీరాజ్, నేటి అమరావతి దినపత్రిక చీఫ్ ఎడిటర్ మున్నం చిన సుబ్బారెడ్డి, నటుడు నిర్మాత డాక్టర్ మూసా అలీ ఖాన్, ప్రముఖ మిమిక్రీ స్టార్ తోట సిల్వర్ స్టార్, ఎన్వి సురేంద్రబాబు, నేటి శుభోదయం దినపత్రిక చీఫ్ ఎడిటర్ గోంగూర శ్రీనివాసరావు, సినీ ప్రొడ్యూసర్ డాక్టర్ ఎస్ కే జలీల్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయిరేణి శ్రావణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.