న్యూస్ సెప్టెంబర్ 27 కాట్రేనికోన (నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కాట్రేను కోన : మండలంలోని నడవపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ జీకేడీ ప్రసాదరావుకి 2024 సంవత్సరం గుర్రం జాషువా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురస్కారం లభించింది. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింగళి వెంకయ్య సభావేదికలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.ఈ పురస్కారంలో రూ.50,000 నగదు, ప్రశంసా పత్రం, శాలువా, పుష్పగుచ్ఛం అందించారు.
డాక్టర్ జీకేడీ ప్రసాద రావు 2011లో “దళిత జర్నలిజం” గ్రంథం, దేశంలో దళిత ప్రశ్నకు సంబంధించిన వ్యాస సంపుటి “సామాజిక”ను 2015లో వెలువరించారు. ఇవిగాక దళిత సంబంధిత సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాల మీద వివిధ పత్రికల్లో వందకు పైగా వ్యాసాలు రాశారు. మరికొన్ని పరిశోధన పత్రాలు ప్రచురించారు. ఈయన ప్రస్తుతం వందేళ్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్రలో ముఖ్యఘట్టాల మీద వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు.
డాక్టర్ ప్రసాదరావు ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగంలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు.
పురస్కార ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక మరియు సృజన శాఖ కార్యనిర్వహాక సంచాలకులు ఆర్. మల్లికార్జునరావు, విజయవాడ కలెక్టర్ ఎస్పీ షా, చైర్మన్ పొడపాటి తేజస్విని ఇతర చైర్మన్లు, ఇతర రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.

డాక్టర్ జీకేడీ ప్రసాద్ కి జాషువా రాష్ట్ర పురస్కారం
న్యూస్ సెప్టెంబర్ 27 కాట్రేనికోన (నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేను కోన : మండలంలోని నడవపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ జీకేడీ ప్రసాదరావుకి 2024 సంవత్సరం గుర్రం జాషువా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురస్కారం లభించింది. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింగళి వెంకయ్య సభావేదికలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.ఈ పురస్కారంలో రూ.50,000 నగదు, ప్రశంసా పత్రం, శాలువా, పుష్పగుచ్ఛం అందించారు. డాక్టర్ జీకేడీ ప్రసాద రావు 2011లో “దళిత జర్నలిజం” గ్రంథం, దేశంలో దళిత ప్రశ్నకు సంబంధించిన వ్యాస సంపుటి “సామాజిక”ను 2015లో వెలువరించారు. ఇవిగాక దళిత సంబంధిత సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాల మీద వివిధ పత్రికల్లో వందకు పైగా వ్యాసాలు రాశారు. మరికొన్ని పరిశోధన పత్రాలు ప్రచురించారు. ఈయన ప్రస్తుతం వందేళ్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్రలో ముఖ్యఘట్టాల మీద వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. డాక్టర్ ప్రసాదరావు ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగంలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. పురస్కార ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక మరియు సృజన శాఖ కార్యనిర్వహాక సంచాలకులు ఆర్. మల్లికార్జునరావు, విజయవాడ కలెక్టర్ ఎస్పీ షా, చైర్మన్ పొడపాటి తేజస్విని ఇతర చైర్మన్లు, ఇతర రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.

