Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

డాక్టర్ జాహ్నవి రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం!!!పట్టణ అధ్యక్షులు అమీర్ బాబు

Punnami Newsroom Published: Updated:
డాక్టర్ జాహ్నవి రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం!!!పట్టణ అధ్యక్షులు అమీర్ బాబు

Story highlights

  • స్థానిక పామూరు పట్టణ మండల స్థాయి జడ్పీటీసి ఎన్నికల్లో, అధిష్టాన టీడీపీ పార్టీ బలపరచిన అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డిని అత్యధిక మెజారిటీ తో గెలిపించి నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు కానుకగా ఇస్తామని, పామూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు అమీర్ బాబు ఎన్నికల ప్రచార…
  • ప్రచార కార్యక్రమంలో భాగంగా 5 వ ఎంపీటీసీ పరిధిలోని గోపాలపురం గ్రామంలో, స్థానిక నాయకులు, కార్యకర్తల, పార్టీ శ్రేణుల మధ్య ప్రచార కార్యక్రమం ముమ్మరం చేశారు..బైరెడ్డి జెశ్వంత్ రెడ్డి సారద్యం లో సాగిన ఈ ప్రచార కార్యక్రమం లో మాజీ సర్పంచ్ కవిటి సుబ్బయ్య,5వ ఎంపీటీసీ అంచూరి…

స్థానిక పామూరు పట్టణ మండల స్థాయి జడ్పీటీసి ఎన్నికల్లో, అధిష్టాన టీడీపీ పార్టీ బలపరచిన అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డిని అత్యధిక మెజారిటీ తో గెలిపించి నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు కానుకగా ఇస్తామని, పామూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు అమీర్ బాబు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఓటర్లతో అన్నారు..డాక్టర్ జాహ్నవి విద్యావంతులు కావడంతో చదువుకున్న యువత ఓటు బ్యాంకు సులువుగా జాహ్నవి వైపు మొగ్గు చూపుతుందని, తద్వారా నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేసే దిశగా జాహ్నవి పయనిస్తుందని, విలేఖరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు అమీర్లి బాబు తెలియచేసారు..టీడీపీ ప్రభుత్వం పరిపాలన తీరు, పార్టీ అమలు చేసే ప్రజా ప్రయోజన పధకాల గురించి ఓటర్లకు తెలుపుతూ ప్రచార కార్యక్రమం కొనసాగించారు.. ప్రచార కార్యక్రమంలో భాగంగా 5 వ ఎంపీటీసీ పరిధిలోని గోపాలపురం గ్రామంలో, స్థానిక నాయకులు, కార్యకర్తల, పార్టీ శ్రేణుల మధ్య ప్రచార కార్యక్రమం ముమ్మరం చేశారు..బైరెడ్డి జెశ్వంత్ రెడ్డి సారద్యం లో సాగిన ఈ ప్రచార కార్యక్రమం లో మాజీ సర్పంచ్ కవిటి సుబ్బయ్య,5వ ఎంపీటీసీ అంచూరి వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అమీర్ బాబు,నీటి సంఘాల అధ్యక్షులు పాలపర్తి రమణయ్య,బీసీల సంఘం అధ్యక్షులు ఓగురు ఏడుకొండలు, అనిల్,నేలపాటి మాల్యాద్రి,రాము, దేవరకొండ నారాయణ, రాము నొస్సమ్ నాగేంద్ర చారి పాల్గొని జయప్రదం చేశారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *