32వ వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
★ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి
★ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం
★ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో కళ్ళద్దాల పంపిణీ కార్యక్రమం
★ 170 మంది పేదలకు కళ్ళద్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
జీవీఎంసీ 32 వ వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.
కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లిపురం 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో నిర్వహించిన కళాద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఆయన చేతుల మీద 170 మంది నిరుపేదలందరికీ కల్లద్దాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే 32 వ వార్డు అభివృద్ధికి కూడా స్థానిక కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్పారు. ఈ క్రమంలోనే దశల వారీగా వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
ఈ వార్డులో ప్రతి పని త్వరలో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సహకారంతో వార్డు అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చలువ తోటలో కళ్యాణ మండపం నిర్మాణం త్వరలో పూర్తికానుందని వెల్లడించారు. అలాగే 80 ఏళ్ల చరిత్ర ఉన్న ఏడుగుళ్ల ప్రాంత నివాసులకు సొంత ఇల్లు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ విషయంలో ఎమ్మెల్యే సహకరించాలని కోరారు.
అలాగే వార్డులో చేపట్టిన ప్రతి అభివృద్ధి పని పూర్తి కావడం జరుగుతుందన్నారు.
ప్రజా సంక్షేమ విషయంలో తాను రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పారు. ప్రజలకు మంచి చేయడమే తన లక్ష్యమన్నారు.
నవంబర్ 30న తన పుట్టినరోజు సందర్భంగా అల్లిపురం తన కార్యాలయం ప్రాంగణంలో సుమారు పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
అలాగే నిరుపేదలకు దుప్పట్లు ,చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, జనసేన పార్టీ నాయకులు కందుల కృష్ణ, సిపిఐ బుజ్జి,ఆధిబాబు,
గీత, కందుల బద్రీనాథ్ కందుల కేదార్నాథ్, జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు తెలుగు లక్ష్మి, బిజెపి నాయకులు శాలివాహన, రమేష్ పాడి, అప్పారావు,హేమ,భారతి, జ్యోతి, కుమారి తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.


