హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు విశేష ఉత్సాహం,ఆనందంతో సాగాయి.వరల్డ్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలు మరియు జూనియర్ కాలేజ్ గర్ల్స్ అలాగే గొబ్బిళ్ళ అక్షర స్కూల్‌లలో ఈ వేడుకలను భవ్యంగా నిర్వహించారు.పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు మెడల్స్,మోమెంటోలు, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. విద్యార్థినుల ప్రతిభను అభినందించిన అతిథుల ప్రసంగాలు పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు సయ్యద్ మెహతాజ్ బేగం మాట్లాడుతూ ప్రతి బాలిక స్వప్నం నిజం కావాలి.విద్యతో పాటు స్ఫూర్తి,ప్రోత్సాహం, సమాన హక్కులు కల్పించడం ప్రతి సమాజం యొక్క బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే డబ్ల్యూ హెచ్ ఆర్సీ నిర్వహిస్తున్న మానవహక్కుల అవగాహన కార్యక్రమాలు, బాలిక విద్యాభివృద్ధి,భద్రత పై సంస్థ తీసుకుంటున్న చర్యలను వివరించారు.
డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ ఇద్దరి స్కూల్‌లలో విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల చదువులో గడిపే ప్రతి నిమిషం,దేశ భవిష్యత్తుకే పెట్టుబడి అని.వారి హక్కులను రక్షించటం మనందరి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూ హెచ్ ఆర్సీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జుల్ఫికర్, రాయలసీమ జోన్ ఎడ్యుకేషన్ సెల్ ప్రెసిడెంట్ వరప్రసాద్, స్టేట్ సెక్రటరీ రవితేజ పాల్గొని విద్యార్థినులను అభినందించారు.ఇరు స్కూలు ప్రిన్సిపాలు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థినుల సమన్వయంతో కార్యక్రమాలు ఆనందభరితంగా పాల్గునారు.
పిల్లలే రేపటి భారత నిర్మాతలు.వారి కలలకు రెక్కలు ఇవ్వడం,హక్కులకు రక్షణ కల్పించడం డబ్ల్యూ హెచ్ ఆర్సీ ప్రధాన ధ్యేయమని నిర్వాహకులు తెలిపారు.

డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు విశేష ఉత్సాహం,ఆనందంతో సాగాయి.వరల్డ్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలు మరియు జూనియర్ కాలేజ్ గర్ల్స్ అలాగే గొబ్బిళ్ళ అక్షర స్కూల్‌లలో ఈ వేడుకలను భవ్యంగా నిర్వహించారు.పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు మెడల్స్,మోమెంటోలు, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. విద్యార్థినుల ప్రతిభను అభినందించిన అతిథుల ప్రసంగాలు పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు సయ్యద్ మెహతాజ్ బేగం మాట్లాడుతూ ప్రతి బాలిక స్వప్నం నిజం కావాలి.విద్యతో పాటు స్ఫూర్తి,ప్రోత్సాహం, సమాన హక్కులు కల్పించడం ప్రతి సమాజం యొక్క బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే డబ్ల్యూ హెచ్ ఆర్సీ నిర్వహిస్తున్న మానవహక్కుల అవగాహన కార్యక్రమాలు, బాలిక విద్యాభివృద్ధి,భద్రత పై సంస్థ తీసుకుంటున్న చర్యలను వివరించారు. డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ ఇద్దరి స్కూల్‌లలో విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల చదువులో గడిపే ప్రతి నిమిషం,దేశ భవిష్యత్తుకే పెట్టుబడి అని.వారి హక్కులను రక్షించటం మనందరి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూ హెచ్ ఆర్సీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జుల్ఫికర్, రాయలసీమ జోన్ ఎడ్యుకేషన్ సెల్ ప్రెసిడెంట్ వరప్రసాద్, స్టేట్ సెక్రటరీ రవితేజ పాల్గొని విద్యార్థినులను అభినందించారు.ఇరు స్కూలు ప్రిన్సిపాలు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థినుల సమన్వయంతో కార్యక్రమాలు ఆనందభరితంగా పాల్గునారు. పిల్లలే రేపటి భారత నిర్మాతలు.వారి కలలకు రెక్కలు ఇవ్వడం,హక్కులకు రక్షణ కల్పించడం డబ్ల్యూ హెచ్ ఆర్సీ ప్రధాన ధ్యేయమని నిర్వాహకులు తెలిపారు.

