Thursday, 5 February 2026
  • Home  
  • డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు.
- E-పేపర్

డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు.

నందలూరు మండలంలో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (డబ్ల్యూ హెచ్ ఆర్సీ) ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి బాపులే ఆంధ్ర ప్రదేశ్ బి. సి. గురుకుల పాఠశాల & జూనియర్ కాలేజ్ (గర్ల్స్), నందలూరు మరియు గొబ్బిళ్ళ అక్షర స్కూల్ లో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తూ మెడల్స్, మోమెంటోస్, సర్టిఫికేట్స్. ప్రదానం చేసి విద్యార్థినులను సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలుసయ్యద్ మెహతాజ్ బేగం మాట్లాడుతూ ప్రతి బాలిక స్వప్నం నిజం కావాలి. వారికి విద్యతో పాటు స్ఫూర్తి, ప్రోత్సాహం, సమాన హక్కులు కల్పించడం సమాజం యొక్క బాధ్యత” అని తెలిపారు. అలాగే, డబ్ల్యూ హెచ్ ఆర్సీ చేపడుతున్న మానవహక్కుల అవగాహన కార్యక్రమాలు, బాలిక విద్య, భద్రత పై సంస్థ కట్టుబాటును వివరించారు. డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ కూడా ఇరువురు పాఠశాల లోని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తు పై దృష్టి పట్టి చదివి , ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. హక్కులను రక్షించే బాధ్యత అని పేర్కొన్నారు. డబ్ల్యూ హెచ్ ఆర్సీ టీమ్ మరియు స్కూల్ నిర్వాహకుల పాత్ర ప్రశంసనీయం ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూ హెచ్ ఆర్సీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జుల్ఫికర్, రాయలసీమ జోన్ ఎడ్యుకేషన్ సెల్ ప్రెసిడెంట్ వరప్రసాద్, స్టేట్ సెక్రెటరీ రవితేజపాల్గొని విద్యార్థినులను అభినందించారు. ఇరువురు స్కూల్ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు.

నందలూరు మండలంలో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (డబ్ల్యూ హెచ్ ఆర్సీ) ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి బాపులే ఆంధ్ర ప్రదేశ్ బి. సి. గురుకుల పాఠశాల & జూనియర్ కాలేజ్ (గర్ల్స్), నందలూరు మరియు గొబ్బిళ్ళ అక్షర స్కూల్ లో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తూ
మెడల్స్, మోమెంటోస్, సర్టిఫికేట్స్. ప్రదానం చేసి విద్యార్థినులను సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలుసయ్యద్ మెహతాజ్ బేగం మాట్లాడుతూ ప్రతి బాలిక స్వప్నం నిజం కావాలి. వారికి విద్యతో పాటు స్ఫూర్తి, ప్రోత్సాహం, సమాన హక్కులు కల్పించడం సమాజం యొక్క బాధ్యత” అని తెలిపారు.
అలాగే, డబ్ల్యూ హెచ్ ఆర్సీ చేపడుతున్న మానవహక్కుల అవగాహన కార్యక్రమాలు, బాలిక విద్య, భద్రత పై సంస్థ కట్టుబాటును వివరించారు.
డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ కూడా ఇరువురు పాఠశాల లోని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ
విద్యార్థులు తమ భవిష్యత్తు పై దృష్టి పట్టి చదివి , ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. హక్కులను రక్షించే బాధ్యత అని పేర్కొన్నారు.
డబ్ల్యూ హెచ్ ఆర్సీ టీమ్ మరియు స్కూల్ నిర్వాహకుల పాత్ర ప్రశంసనీయం ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూ హెచ్ ఆర్సీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జుల్ఫికర్,
రాయలసీమ జోన్ ఎడ్యుకేషన్ సెల్ ప్రెసిడెంట్ వరప్రసాద్, స్టేట్ సెక్రెటరీ రవితేజపాల్గొని విద్యార్థినులను అభినందించారు. ఇరువురు స్కూల్ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.