నగరంలోని విజయ్ మహల్ గేట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బారికెట్లను ట్రాఫిక్ అంతరాయం గూర్చి పున్నమి దినపత్రికలో ప్రచురితం ఆయన విషయం విధితమే. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను అధికారులు తొలగించారు ఈ చర్యతో రహదారి పై వాహన రద్దీ తగ్గి, ప్రయాణికులు, వ్యాపారదారులు, స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.
గత కొన్ని రోజులుగా ప్రధాన జంక్షన్, రోడ్ల వద్ద బారికేడ్లు అధికంగా ఉండటం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అంబులెన్స్ సేవలు, విద్యార్థుల రాకపోకలు కూడా ఇబ్బంది పడ్డాయి. ప్రజల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు బారికేడ్‌లను పరిశీలించి, అవసరం లేని వాటిని తొలగించారు.
ప్రజలు దీనిని స్వాగతిస్తూ, ట్రాఫిక్ సమస్యలపై త్వరగా స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్లపై సజావుగా వాహనాలు వెళ్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ట్రాఫిక్ సమస్యలపై వేగవంతమైన చర్య – బారికేడ్లు తొలగించిన అధికారులు
నగరంలోని విజయ్ మహల్ గేట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బారికెట్లను ట్రాఫిక్ అంతరాయం గూర్చి పున్నమి దినపత్రికలో ప్రచురితం ఆయన విషయం విధితమే. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను అధికారులు తొలగించారు ఈ చర్యతో రహదారి పై వాహన రద్దీ తగ్గి, ప్రయాణికులు, వ్యాపారదారులు, స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ప్రధాన జంక్షన్, రోడ్ల వద్ద బారికేడ్లు అధికంగా ఉండటం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అంబులెన్స్ సేవలు, విద్యార్థుల రాకపోకలు కూడా ఇబ్బంది పడ్డాయి. ప్రజల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు బారికేడ్‌లను పరిశీలించి, అవసరం లేని వాటిని తొలగించారు. ప్రజలు దీనిని స్వాగతిస్తూ, ట్రాఫిక్ సమస్యలపై త్వరగా స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్లపై సజావుగా వాహనాలు వెళ్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

